Suriya Apologized Media :కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్లో తెరకెక్కిన సినిమా 'కంగువా'. శవ దర్శకత్వంలో ఇది పాన్ఇండియా లెవెల్లో తెరకెక్కింది. నవంబర్ 14న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే మూవీటీమ్ ముంబయిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే ఈ మీట్లో సూర్య మీడియాకు సారీ చెప్పి, ఆశ్చర్యపరిచారు. మరి ఆయన సారీ ఎందుకు చెప్పారంటే?
ముంబయి ప్రెస్‌మీట్‌కు బయల్దేరిన సూర్య సమయానికి అక్కడకు చేరుకోలేదు. పలు కారణాల వల్ల ఆయన ఈ సమావేశానికి గంట ఆలస్యంగా వెళ్లారు. దీంతో ఆయన మీడియాకు క్షమాపణలు చెప్పారు. 'ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యిందని సాకులు చెప్పను. మీ అందరి సమయానికి నేను విలువనిస్తాను. అయితే దీన్ని నేను నియంత్రించలేకపోయా' అని సూర్య చెప్పారు.
ఇక మీటింగ్‌లో సినిమాపై పలు ప్రశ్నలకు సూర్య సమాధానమిచ్చారు. కంగువా పార్ట్ 2 గురించి కూడా మాట్లాడారు. పార్ట్ 1 కోసం ఎంతలా ఎదురుచూశారో, రెండో భాగం కోసం అంతకంటే ఎక్కువ ఆత్రుతతో వెయిట్ చేస్తారు. 'పార్ట్ 1 క్లైమాక్స్‌లో అనేకమైన ఆశ్చర్యకర ప్రశ్నలు ఉంటాయి. వాటన్నిటికీ పార్ట్ 2లోనే ఆన్సర్ ఉంటుంది. అందుకే మీతోపాటు రెండో భాగంగ కోసం నేనూ ఎదురుచూస్తున్నా' అని పేర్కొన్నారు.
10వేల స్క్రీన్స్