తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

''నేను లోకల్' సినిమా నేనే చేయాల్సింది, కానీ'- సందీప్ కిషన్ - SUNDEEP KISHAN MAZAKA

సందీప్ కిషన్ కొత్త సినిమా టీజర్- ఈవెంట్​లో మాట్లాడిన హీరో

Sundeep Kishan Majaka
Sundeep Kishan Majaka (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2025, 10:39 PM IST

Sundeep Kishan Mazaka :టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లీడ్​ రోల్​లో నటించిన లేటెస్ట్ సినిమా 'మజాకా'. దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమా తెరకెక్కించారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్​లో ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్​కు హాజరైన హీరో సందీప్ మాట్లాడారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన బ్లాక్​ బస్టర్ హిట్లు 'నేను లోకల్', 'హలో గురు ప్రేమకోసమే' సినిమాలు తాను చేయాల్సినవే అని అన్నారు.

'దాదాపు 15 ఏళ్ల కెరీర్‌లో ఇది నా 30వ సినిమా. 2024 నాకు చాలా ప్రత్యేకం. కొన్ని సంవత్సరాల కష్టానికి గతేడాది ఫలితం దక్కిందనుకుంటున్నా. 'మజాకా' కూడా 2024లోనే మొదలైంది. నన్ను మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్​ సినిమాలో చూడాలనుందని చాలా మంది అన్నారు. నాని, వరుణ్‌ సందేశ్‌, అల్లరి నరేశ్‌ అన్నతో కలిసి 'మేం వయసుకు వచ్చాం' సినిమా ప్రీమియర్‌ షోకి వెళ్లా. సినిమాలోని ఓ సీన్​కి అందరం ఎమోషనలై కంటతడి పెట్టుకున్నాం. అప్పుడే త్రినాథరావుతో కలిసి పనిచేయాలని అనుకున్నా. కొన్నాళ్ల తర్వాత ఓ సినిమా అనుకున్నా అది కుదరలేదు.

'సినిమా చూపిస్త మావ' టీజర్‌ నచ్చడం వల్ల ఈ మూవీ ఎవరిదా? అని చూస్తే దానికీ ఆయనే దర్శకుడు. కుటుంబమంతా కలిసి సినిమా చూసేలా, నవ్వుకునేలా ఉండే కథలు నాకు ఇష్టం. అందుకే ఈ సినిమా రచయిత ప్రసన్న బెజవాడను పిలిచి, ఇలాంటి ఫార్మాట్లోనే నాకూ ఓ కథ రాయమని అడిగా. 'నేను లోకల్‌' సినిమా నాతోనే దాదాపు ఖరారైంది. ఆఖరి క్షణంలో షిఫ్ట్‌ అయ్యింది. ఆ తర్వాత 'హలో గురు ప్రేమకోసమే' ప్రకటించాం. ఇంకో 10 రోజుల్లో షూటింగ్‌ అనుకుంటే అది కూడా వర్కౌట్‌ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టు సెట్‌ అవ్వడం హ్యాపీగా ఉంది' అని సందీప్ అన్నారు.

ఇక ఈ సినిమాలో రితూ వర్మ హీరోయిన్​గా నటించింది. 'మన్మధుడు' ఫేమ్ హీరోయిన్ అన్షు, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్, హాస్య బ్యానర్లపై రాజేశ్, ఉమేశ్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details