Rashmika Anand Devarakonda:టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతేడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'బేబీ' తర్వాత ఆనంద్ నుంచి రానున్న సినిమా కావడం వల్ల దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ ఉదయ్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రీసెంట్గా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు స్టార్ హీరోయిన్ రష్మికా మంధన్నా హాజరయ్యారు.
అయితే ఈవెంట్లో రష్మిక- ఆనంద్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మనమంతా ఓ ఫ్యామిలీ అని, తాను ఎక్కువగా ఆనంద్‌పై ఆధారపడతానని రష్మిక అన్నారు. అయితే ఆనంద్ సోదరుడు విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్లో ఉన్నారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈమె కామెంట్స్ తెగ వైరలయ్యాయి. వాళ్ల మధ్య ఏం జరుగుతోందని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. కాగా, రష్మిక కామెంట్స్‌పై ఆనంద్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
'నా సినిమా ఈవెంట్లలో రష్మిక పాల్గొంది రెండుసార్లే (నవ్వుతూ). మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్. అందుకే మొన్న ఈవెంట్లో మనం ఫ్యామిలీ అని ఆమె అన్నారు. ఆ అనుబంధంతోనే నా సినిమా వేడుకలకు వస్తుంటారు. అయితే నాపై ఆధారపడుతుంటానని ఎందుకన్నారో నాకూ తెలియదు' అని ఆనంద్ అన్నారు.