Bharateeyudu 2 review:లోకనాయకుడు కమల్‌హాసన్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన 'భారతీయుడు- 2' శుక్రవారం (జులై 12) థియేటర్లలో విడుదల అయ్యింది. 1996లో బ్లాక్‌బస్టర్ హిట్ 'భారతీయుడు' సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు హైదరాబాద్ సహా పలు నగరాల్లో శుక్రవారం ఉదయాన్నే స్పెషల్ షోస్ పడ్డాయి. మరి దాదాపు 28ఏళ్ల తర్వాత కమల్- శంకర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఆడియెన్స్ టాక్ ఏంటంటే?
భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచే మిశ్రమ స్పందన వస్తోంది. ఎప్పటిలాగే అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం ఇరగదీశాడని అంటున్నారు. కానీ, స్టోరీ మాత్రం రోటిన్‌గా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రొటీన్ స్టోరీకి బీజీఎమ్, వీఎఫ్క్స్ జోడించారని తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలిపారు. అయితే ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు మాత్రం సినిమా అదిరిపోయిందంటూ రివ్యూలు ఇస్తున్నారు. హీరోగా కమల్‌హాసన్ మాత్రం నటనలో విశ్వరూపం చూపించారని టాక్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టారంట. సినిమాలో ఆయన నటనే హైలైట్ అంటున్నారు.
ఇక అక్కడక్కడా కమల్ హాసన్, సిద్ధార్థ్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారంట. వీఎక్స్, విజువల్స్‌తో మాత్రం శంకర్ ఆడియెన్స్‌కు ట్రీట్ ఇచ్చారంట. సీజీ వర్క్స్‌తో సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించారని అంటున్నారు. ఇక 'భారతీయుడు- 3' పైన ఆసక్తి పెంచేలా క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులను మెప్పిస్తుందట. కాగా, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, సముద్రఖని, బాబి సింహా తదితరులు తమతమ పాత్రల్లో అదరగొట్టారని టాక్.