Sreeleela Upcoming Movies :తొలి సినిమాతోనే ప్రేక్షకులను అలరించి, అతికొద్దికాలంలోనే స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్స్‌లో శ్రీలీల ఒకరు. యాక్టింగ్, డ్యాన్స్ ఇలా రెండింట్లోనూ అదరకొట్టి అనతికాలంలోనే అగ్ర తారల సరసన నటించే స్థాయికి ఎదిగిపోయింది. అయితే తాను నటించిన కొన్ని సినిమాలు యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకోవడం వల్ల ఈ నటి క్రమక్రమంగా సినిమాలకు దూరమవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాలకు బ్రేక్ తీసుకుని తన చదువును కొనసాగించింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నితిన్ 'రాబిన్‌హుడ్', పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలు తన లైనప్‌లో ఉండగా, మరో సినిమా ఈ లిస్ట్‌లో చేరనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో మూవీ
అయితే శ్రీలీల ఇప్పటివరకూ తెలుగు, కన్నడ సినిమాలు మాత్రమే చేసింది. కానీ ఆమె ఇప్పుడు తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవ్వనుందట. అది కూడా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధ కొంగర సినిమాలో. ప్రస్తుతం ఇదే విషయం అటు సినీ ఇండస్ట్రీతో పాటు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
వాస్తవానికి సుధ కొంగర సూర్యతో ఓ సినిమా చేయాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి సూర్య తప్పుకున్నారు. దీంతో ఇప్పుడిదే మూవీని మరో కోలీవుడ్ యాక్టర్ శివ కార్తికేయన్‌తో తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇప్పుడీ సినిమాలో శ్రీలీల నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.