తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అర్రెర్రే! మహేశ్, సూర్య క్లాస్‌మేట్సా? నాగి, రానా కూడా మంచి దోస్తులట! - South Celebrities Studied Together - SOUTH CELEBRITIES STUDIED TOGETHER

South Celebrities Who Studied Together : సెలబ్రెటీ నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. అయితే బాల్య స్నేహితుడు ఇంకా స్పెషల్. దాదాపు చిన్ననాటి స్నేహాలు తరగతి గది నుంచి మొదలవుతాయి. ఈ క్రమంలో తమ స్నేహం కూడా అలా క్లాస్ రూమ్ లోనే చిగురించిందీ అంటున్న ఈ ప్రముఖులు- ఎవరితో కలిసి చదువుకున్నారంటే?

South Celebrities Who Studied Together
Nag Aswhin Rana (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 7:30 PM IST

South Celebrities Who Studied Together :చాలా మంది స్నేహితులు స్కూల్, కాలేజ్ డేస్ లోనే పరిచయం అవుతారు. స్నేహాలు చాలా వరకు క్లాస్‌ రూమ్‌ లోనే ప్రారంభం అవుతాయి. ఆటలు, అల్లరితో మరింత దగ్గరవుంది స్నేహ బంధం. తమ స్నేహం కూడా అలా క్లాస్ రూమ్ లోనే చిగురించిందీ అంటున్నారు ఈ ప్రముఖులు. ఈ క్రమంలో ఎవరు ఎవరితో కలిసి చదువుకున్నారు? అప్పట్లో వారి స్నేహబంధం ఎలా ఉండేదో? ప్రముఖలు మాటల్లోనే తెలుసుకుందాం.

ఇద్దరం ప్రాణ స్నేహితులం- దుల్కర్‌ సల్మాన్‌
చిన్నప్పటి నుంచి నేనూ, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రాణ స్నేహితులం. ఒకర్ని వదిలిపెట్టి ఒకరం ఉండేవాళ్లం కాదు. కలిసి తినేవాళ్లం, ఆడుకునేవాళ్లం. కొచ్చిలోని మా ఇద్దరి ఇళ్లు దగ్గరిదగ్గరిగా ఉండేవి. మేం స్నేహితులం కావడానికి కారణం మా నాన్నలు. వాళ్ళు కూడా మంచి స్నేహితులు. అందుకే మా ఇద్దర్నీ ఒకే స్కూల్లో చేర్పించడం వల్ల కలిసి వెళ్లేవాళ్లం. మా ఇద్దరికి చదవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒక్కోసారి పృథ్వీరాజ్ మా ఇంట్లోనే పడుకునేవాడు. స్కూల్ సెలవు రోజు సినిమాలు చూసేవాళ్లం. మేమిద్దరం కూడా హీరోల్లా గెటప్స్ వేసుకుని రిహార్సల్స్‌ చేసేవాళ్లం. అయితే నేను మూడో తరగతికి వచ్చాక మా కుటుంబం చెన్నైకి షిఫ్టు అవ్వడం వల్ల పృథ్వీకి దూరంగా వచ్చా. చాలా కాలం బాధపడ్డాను. ఇప్పుడు మాత్రం తరచూ కలుసుకుంటాం.

'స్కూల్లో ఆమె పక్కనే కూర్చొనేదాన్ని'- అనుష్క శర్మ
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి నా చిన్ననాటి స్నేహితురాలు. మేమిద్దరం అసోంలోని మార్గరీటాలో ఉన్న సెయింట్‌ మేరీస్‌ స్కూల్లో కలిసి చదువుకున్నాం. సాక్షిది అసోంలోని టిన్సుకియా. మాది అయోధ్య. మా ఇద్దరి నాన్నల ఉద్యోగాల రీత్యా మార్గరీటాలో ఉండేవాళ్లం. స్కూలుకెళ్లిన మొదటి రోజు నేను సాక్షి పక్కన కూర్చున్నా. ఆరోజు నాతో సాక్షి చాలా బాగా మాట్లాడింది. అప్పటి నుంచి ప్రతిరోజూ సాక్షి పక్కనే కూర్చునేదాన్ని. హోమ్‌ వర్క్‌ విషయంలో ఏ డౌట్ వచ్చినా తననే అడిగేదాన్ని. క్రమంగా మా అమ్మలు కూడా స్నేహితులయ్యారు. తరచూ మా రెండు కుటుంబాలూ కలిసేవి. ఆరో తరగతికొచ్చాక నాన్నకు బదిలీ అవ్వడం వల్ల సాక్షికి దూరంగా వచ్చేశా. ఎవరి వృత్తిలో వాళ్లం స్థిరపడ్డాక మళ్లీ కలుసుకున్నాం. నాకెప్పుడైనా సాక్షి గుర్తొస్తే చిన్న వయసులో తనతో దిగిన ఫొటో చూసుకుని ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటాను.

నాగ్ అశ్విన్ చాలా సైలంట్ - రానా
సినిమాల్లోకి రాకముందు నుంచే డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో ఇద్దరం ఒకటి నుంచి మూడో తరగతి వరకూ కలిసి చదువుకున్నాం. ఆ తరవాత సెక్షన్లు వేరయ్యాయి. కానీ రోజూ ఇద్దరం కలుసుకునేవాళ్లం. నాగ్ అశ్విన్ చాలా సైలంట్. అవసరానికి తప్పితే మాట్లాడేవాడే కాదు. చదువులో మాత్రం టాపర్‌. ఎవరైనా సాయం అడిగితే చేసేవాడు. బుక్స్ ఎక్కువగా చదివేవాడు. క్లాస్‌ లేకపోతే లైబ్రరీలోనే ఉండేవాడు. మా ఇద్దరి అభిరుచులూ ఒకటే. 'లీడర్‌' సినిమాతోనే ఇద్దరం ఒకేసారి సినీ ఇండస్ట్రీలోకి వచ్చాం.

ఆ రోజులంటే నాకు చాలా ఇష్టం - సూర్య
చెన్నైలోని సెయింట్‌ బీడ్స్‌ స్కూలు వైపు వెళితే చిన్ననాటి జ్ఞాపకాలెన్నో గుర్తుకొస్తాయని ప్రముఖ నటుడు సూర్య అంటున్నారు. అక్కడ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదువుకున్నానని చెబుతున్నారు. హీరో మహేశ్‌ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ యువన్‌ శంకర్‌ రాజా తన క్లాస్‌ మేట్స్‌ అని, వాళ్లతో చదువుకున్న రోజులంటే తనకెంతో ఇష్టమని తెలిపారు.

"యువన్, మహేశ్, నేను కలిసి తినేవాళ్లం. ఒకరికోసం ఒకరం ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు స్కూల్‌కు తీసుకొచ్చేవాళ్లం. ఇంటి విషయాలు మాట్లాడుకునేవాళ్లం గానీ సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. చదువు పూర్తయ్యాక నేనూ, యువన్‌ శంకర్ రాజా దాదాపు ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం. సుమారు పది సినిమాల్లో కలిసి పనిచేశాం. మహేశ్‌ టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తనతో కలిసి నటించే అవకాశం ఇంకా రాలేదు. కానీ మహేశ్‌ సినిమాలన్నీ తప్పకుండా చూసి ఆయనకు నా అభిప్రాయాన్ని చెబుతుంటాను." అని సూర్య తన క్లాస్ మేట్స్ తో ఉన్న స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కియారా నన్ను ఎప్పుడూ ప్రోత్సహించేది- ఈశా అంబానీ
ఎవరికైనా మంచి చెప్పేవాళ్లే కాదు, విమర్శించే స్నేహితులు కూడా ఉండాలి. అలా చెప్పేవాళ్లే నిజమైన దోస్తులు. నటి కియారా అడ్వాణీ నాకు అలాంటి స్నేహితురాలే. మేమిద్దరం ముంబయిలోని ధీరూబాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదువుకున్నాం. కియారా చదువుతోపాటు ఆటల్లోనూ ముందుండేది. నన్ను కూడా ప్రోత్సహించేది. నచ్చని పని ఏదన్నా చేస్తే వెంటనే చెప్పేది. తను స్కూలుకు రాని రోజు నాకు ఏదో కోల్పోయినట్టు అనిపించేది. స్కూల్లో స్పెషల్ ఈవెంట్స్ జరిగితే కియారాని నేనే రెడీ చేసేదాన్ని. చివరికి పెళ్లిలో తనను అలంకరించడంలోనూ నేను భాగమయ్యా. కియారాకి షూటింగ్‌ లేకపోతే తనతోనే ఎక్కువ టైమ్ గడుపుతాను.

ఫ్రెండ్స్​ చేసిన పనితో ఒక్కసారిగా దిశ పటానీ లైఫ్ టర్న్! - Disha Patani Dhoni Movie

Unstoppable 2: బాలయ్యతో మాజీ సీఎం ముచ్చట్లు.. ఓల్డ్ ఫ్రెండ్స్ కలిస్తే ఆ కిక్కే వేరు!

ABOUT THE AUTHOR

...view details