తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రూట్ మార్చిన టాలీవుడ్- అందరి చూపు ఫాంటసీ వైపు! - Socio Fantasy Movies In Telugu - SOCIO FANTASY MOVIES IN TELUGU

Socio Fantasy Movies In Telugu: తెలుగు చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్​ నుంచి పలు ఇదే జానర్​లో రానున్న సినిమాలపై ఓ లుక్కేయండి.

Socio Fantasy Movies In Telugu
Socio Fantasy Movies In Telugu

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 7:15 AM IST

Socio Fantasy Movies In Telugu:టాలీవుడ్​లో కొంతకాలంగా సోషియో ఫాంటసీ జానర్​ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య 'బంగార్రాజు' నుంచి 'కార్తికేయ 2', 'బింబిసార'’, 'విరూపాక్ష', 'హను-మాన్‌', ఇలా అనేక సినిమాలు బ్లాక్​బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో టాలీవుడ్​లో మరికొంత మంది స్టార్ హీరోలు అలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ ఎక్స్​పీరియన్స్ ఇవ్వనున్నారు. ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఈ కథ పంచభూతాలతో ముడిపడి ఉంటుదని తెలుస్తోంది. అలాగే ముల్లోకాలతో ముడిపడిన అంశాలు ఉంటాయని కూడా సినీవర్లాల్లో టాక్‌. సినిమా కోసం మూవీయూనిట్ ఓ ప్రత్యేకమైన ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తోంది. అవన్నీ సినీప్రియులకు కొత్త అనుభూతినిస్తాయని అంటున్నారు. ఈ మూవీ 2025 జనవరిలో రిలీజ్ కానుంది.

ప్రభాస్:యాక్షన్ సీన్స్​కు కేరాఫ్ అడ్రస్​గా చెప్పుకునే ప్రభాస్​ కూడా ఈ జానర్​లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన 'కల్కి' అనే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్​ ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ 6వేల ఏళ్ల నాటికిందటిది అని టాక్. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ఆకట్టుకుంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా అతి త్వరలోనే థియేటర్లలో సందడి చేసే ఛాన్స్ ఉంది.

నాగచైతన్య:యవసామ్రాట్ నాగచైతన్య దర్శకుడు కార్తీక్‌ దండుతో జతకట్టనున్నాడు. ఈ సినిమా కూడా ఇదే జానర్​లో తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా ఆయన తొలి చిత్రం 'విరూపాక్ష' వలే ఉండనుందట. త్వరలో సినిమా పట్టాలెక్కనుంది.

నిఖిల్:నిఖిల్‌ పాన్ఇండియా సినిమా 'కార్తికేయ- 2' 2022లో భారీ హిట్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ చందూ మొండేటి ఆధ్యాత్మికతకు సైన్స్‌ను ముడిపెట్టి ఈ సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్​గా మూడో పార్ట్​ రానున్నట్లు రీసెంట్​గా హింట్ ఇచ్చారు. రెండో భాగం కథ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ మూడో భాగం కొనసాగనుంది.

నార్త్​లో 'పుష్ప' డామినేషన్- OTT, థియేట్రికల్​ రైట్స్​కే రూ.475 కోట్లు- ఇది సార్ ఐకాన్ స్టార్ బ్రాండు! - Pushpa 2 OTT Rights

'రాజాసాబ్' సెట్స్​లోకి ప్రభాస్ ఎంట్రీ - న్యూ లుక్​లో ఎలా ఉన్నారంటే ? - Prabhas New Look

ABOUT THE AUTHOR

...view details