Shruti Haasan Fake Name : స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తె అయినప్పటికీ శ్రుతి హాసన్ ఇండస్ట్రీలో సొంత గుర్తింపుతో ఎదిగారు. ఆమె ప్రతిభ, హార్డ్‌వర్క్‌తో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించారు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో అగ్ర నటిగా కొనసాగుతున్నారు. ఆమె తమిళంసహా తెలుగులో పలు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హోదా సొంతం చేసుకున్నారు.
అయితే కెరీర్ ప్రారంభంలో తల్లిదండ్రుల పేర్లు ఉపయోగించకుండా, డ్యూప్లికేట్ పేరుతో అవకాశాల కోసం ప్రయత్నించినట్లు శ్రుతి చెప్పారు. ఇండస్ట్రీలో పెద్ద స్టార్లుగా ఉన్న వాళ్ల కీర్తి ప్రతిష్ఠలను వాడుకొని అవకాశాలు పొందాలని అనుకోలేదని ఆమె తెలిపారు. రీసెంట్గా బెంగళూరులో జరిగిన మహిళా క్రికెట్ టోర్నీ ఈవెంట్‌కు హాజరైన శ్రుతిహాసన్ తన కెరీర్ సీక్రెట్స్ బయటపెట్టారు.
'నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులు ఫేమస్, కానీ నేను కాదు. వాళ్ల కుమార్తెగా పెరగడంతోనే కీర్తి, ప్రతిష్ఠలు అంటే గ్రహించగలిగాను. అవి పొందాలంటే చాలా కష్టపడాలి. నా పేరెంట్స్ కష్టపడడం నేను చూశాను. మా నాన్న షూటింగ్‌కు వెళ్లడం, పాత్రల కోసం శిక్షణ పొందడం ఇలా కెరీర్లో ఎంతో కృషి చేశారు'