తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హిందీలో 'స్త్రీ 2' సంచలన కలెక్షన్స్​ - హైయెస్ట్ గ్రాస్​ ఫిల్మ్​గా రికార్డ్​ - Stree 2 Movie Collections - STREE 2 MOVIE COLLECTIONS

Shraddha Kapoor Stree 2 Movie Collections : బాలీవుడ్​ స్టార్స్​ శ్రద్ధా కపూర్, రాజ్​ కుమార్‌ రావు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'స్త్రీ 2'. విడుదలైన ఐదో వారంలోనూ రికార్డ్​ స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోన్న ఈ చిత్రం తాజాగా మరో ఘనతను అందుకుంది. పూర్తి వివరాలు స్టోరీలో.

source  ANI And ETV Bharat
Shraddha Kapoor Stree 2 Movie Collections (source ANI And ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 12:40 PM IST

Shraddha Kapoor Stree 2 Movie Collections : బాలీవుడ్​ స్టార్స్​ శ్రద్ధా కపూర్, రాజ్​ కుమార్‌ రావు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'స్త్రీ 2'. కామెడీ హారర్‌ మూవీగా బాక్సాఫీస్​ ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ హిట్​ను అందుకుంది. రికార్డ్ స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీ కలెక్షన్ల జోరు ఐదో వారంలోనూ కొనసాగుతోంది.

Highest Grossing Hindi Film : తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది. హైయెస్ట్ గ్రాస్​ హిందీ ఫిల్మ్​గా నిలిచింది. జవాన్ హిందీ వెర్షన్​ లైఫ్​ టైమ్​ కలెక్షన్లను క్రాస్ చేసింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శన్​ పోస్ట్ చేశారు. పలు ఇంగ్లీష్ ఎంటర్​టైన్మెంట్​ వెబ్​సైట్లు కూడా ఈ విషయాన్ని వెల్లడించాయి.

తరణ్​ ఆదర్శ్ ట్వీట్ ప్రకారం ఐదో వారంలో శుక్రవారం రూ.3.60కోట్లు, శనివారం రూ.5.55 కోట్లు, ఆదివారం రూ.6.85 కోట్లు, సోమవారం రూ.3.17కోట్లు, మంగళవారం రూ.2.65 కోట్లు వసూలు చేసిందట. మొత్తంగా హిందీలో ఇప్పటివరకు రూ.586 కోట్లు సాధించి రూ.600 కోట్ల దిశగా వెళ్తున్నట్లు తెలిపారు.

గతంలో విడుదలై మంచి సక్సెస్ సాధించిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిందీ 'స్త్రీ 2'. మూవీలో హీరో రాజ్‌కుమార్‌ రావ్‌, సాహో బ్యూటీ, హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ లీడ్ రోల్స్​లో కనిపించారు. అక్షయ్​ కుమార్​, వరుణ్‌ ధావన్‌, తమన్నా అతిథి పాత్రల్లో సందడి చేశారు. ముఖ్యంగా తమన్నా చిందులేసిన ఆజ్ కీ రాత్‌ ప్రత్యేక గీతం సినిమాకు మరో హైలైట్​గా నిలిచింది. శ్రోతలను ఈ పాట విపరీతంగా ఆకట్టుకుని సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అయింది. దర్శకుడు అమర్‌ కౌశిక్‌ ఈ చిత్రాన్ని హారర్‌ కామెడీగా తెరకెక్కించారు.

అలానే ఆగస్టు 15న రిలీజైన ఈ చిత్రానికి పలు స్టార్‌ హీరోల చిత్రాలు వేదా (జాన్‌ అబ్రహం), ఖేల్‌ ఖేల్‌ మే (అక్షయ్‌కుమార్‌)కు గట్టి పోటీని ఇచ్చాయి. అయినప్పటికీ ఈ స్త్రీ 2 మంచి వసూళ్లను అందుకుని శ్రద్ధా కపూర్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

1 మిలియన్ దిశగా 'మత్తు వదలరా 2' కలెక్షన్స్​ - యూఎస్​ఏ మార్కెట్​లోనూ జోరు! - Mathuvadalara 2 USA Collections

దసరా బరిలో ఐదు చిత్రాలు - సినీప్రియుల చూపంతా ఆ సినిమాపైనే! - Tollywood Box Office Dasara 2024

ABOUT THE AUTHOR

...view details