తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'షారుక్ దగ్గర 17 ఫోన్లు' - షాకింగ్​ విషయాలు రివీల్​ చేసిన ఫ్రెండ్​ - షారుక్ ఖాన్ స్నేహితుడు వివేక్​

Shahrukh Khan 17 phones : ఇటీవలే 'డంకీ' సినిమాతో ప్రేక్షకులను అలరించారు బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు తన సన్నిహితులతో చిల్ అవుతుంటారు. తాజాగా ఈ స్టార్ హీరో గురించి తన స్నేహితుడు వివేక్​ వాస్వాని పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే ?

Shahrukh Khan 17 phones
Shahrukh Khan 17 phones

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 6:02 PM IST

Shahrukh Khan 17 phones: బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. ఆన్​స్క్రీన్​పై ఆయన ఎంత కూల్​గా ఉంటారో ఆఫ్​స్క్రీన్​లోనూ అంతే. తన కొలిగ్స్​తో పాటు ఫ్రెండ్స్​తోనూ ఆయన ఎంతో కలివిడిగా ఉంటారు. కష్టాల్లో ఉన్న సమయంలో నేనున్నానంటూ ముందుకొస్తారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తన స్నేహితుడు వివేక్ వాస్వాని చెప్పుకొచ్చారు. తాను కష్టాల్లో ఉన్నప్పుుడు షారుక్ ఎలా ఆదుకున్నారో ఈ సందర్భంగా తెలిపారు.

"సినిమా చేయమని వివేక్ నా దగ్గరకు రావడం ఇదే మొదటిసారి. అందులో ఇంకా ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఈ సినిమా నేను చేస్తున్నాను. ఈ సినిమాలో నటించేందుకు నేను ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్​గా తీసుకోను అంటూ షారుక్ అన్నారు. అంతేకాకుండా కనీసం సినిమాకు సంబంధించిన కథను కూడా ఆయన వినలేదు. ఇందులో షారుక్ 42 నిమిషాలు పాటు కనిపిస్తారు. అందులో ఒక సీన్ కూడా ఎడిట్ చేసేందుకు ఆయన అస్సులు ఒప్పుకోలేదు. షారుక్ సంబంధించిన సీన్స్ అన్నీకూడా ఐదు రోజుల్లో పూర్తి చేశాం". అంటూ వివేక్​ పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఇదే ఇంటర్వ్యూలో షారుక్ వద్ద 17 ఫోన్లు ఉన్నట్లు వెల్లడించారు.

'ఇకపై పాత్రకు తగ్గట్లు సినిమాలు చేస్తా'
Shahrukh Khan Next Movie Update: 'డంకీ' తర్వాత షారుక్ ఎటువంటి సినిమాల్లో నటించనున్నారన్న విషయంపై ఫ్యాన్స్​లో ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై తాజాగా కింగ్​ క్రేజీ అప్డేట్​ ఇచ్చారు. "ఈ సారి కొత్తగా ప్రయత్నించాలని అనుకుంటున్నా. నా వయసుకు తగిన సినిమాలు చేస్తాను. అందులోనూ నేను ప్రధాన పాత్రలో నటిస్తాను. అది అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా. నా నెక్ట్స్ మూవీ వచ్చే ఏడాది మార్చి లేదంటే ఏప్రిల్​లో ప్రారంభం కానుంది" అని షారుక్ చెప్పారు. డంకీ రిలీజ్​ తర్వాత ఒక్క రోజులో తన తదుపరి సినిమాల గురించి చెప్పటం, ఇకపై ఎలాంటి సినిమాలు చేస్తారనే విషయంపై షారుక్ మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే తన కొత్త సినిమా ఎవరి దర్శకత్వంలో నటించనున్నారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

'ఇక నా పిల్లలకు శ్రీ వల్లి సాంగ్​ నేర్పిస్తాను' - అయాన్​ పాటకు కింగ్​ ఖాన్ రియాక్షన్​

బడ్జెట్​ రూ.124 కోట్లు- కలెక్షన్​ రూ.3,145 కోట్లు- షారుక్ ఖాన్​ వదులుకున్న ఆ సూపర్ హిట్​ మూవీ ఏదంటే?

ABOUT THE AUTHOR

...view details