తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఇక నా పిల్లలకు శ్రీ వల్లి సాంగ్​ నేర్పిస్తాను' - అయాన్​ పాటకు కింగ్​ ఖాన్ రియాక్షన్​ - Shah Rukh Khan lutput gaya

Shah Rukh Khan Allu Ayaan : ఇటీవలే అల్లు అయాన్ పాడిన 'లుట్​ పుట్​ గయా' వీడియోకు బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ స్పందించారు.

Shah Rukh Khan Allu Ayaan
Shah Rukh Khan Allu Ayaan

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 4:55 PM IST

Updated : Feb 25, 2024, 5:16 PM IST

Shah Rukh Khan Allu Ayaan :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఇటీవలే డంకీ సినిమాలోని లుట్​ పుట్ గయా సాంగ్​ను పాడుతూ నెట్టింట సందడి చేసింది తెలిసిందే. అయితే ఆ వీడియో కాస్త వైరల్ అయ్యి కింగ్​ ఖాన్ షారుక్ దృష్టికి చేరుకుంది. దీంతో ఈ స్వీట్ వీడియోపై షారుక్ స్పందించారు. అల్లు అర్జున్​కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.

"థ్యాంక్​ యూ లిటిల్ వన్​. నీ ఫ్లవర్ అండ్ ఫైర్ రెండూ ఒకేదాంట్లో చూపించావు. ఇప్పుడు నా పిల్లల చేత శ్రీ వల్లి పాట ప్రాక్టీస్​ చేయిస్తాను." అంటూ అల్లు అర్జున్​ను మెన్షన్ చేస్తూ షారుక్​ పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్ట్​కు అల్లు అర్జున్​ కూడా రిప్లై ఇచ్చారు. 'షారుక్ జీ సో స్వీట్​ ఆఫ్​ యూ' అంటూ బన్నీ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు.

అల్లు అయాన్ సినీ ఎంట్రీ
మరోవైపు అల్లు అయాన్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్హ - సమంత శాకుంతలం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి తన ముద్దుముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అయాన్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నాడని తెలిసింది. దీని కోసం బన్నీ ఓ సూపర్ ప్లాన్ వేశారని టాక్ వినిపిస్తోంది. అల్లు అయాన్​ ఇప్పటికే మోడల్​గా క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. రీసెంట్​గా షారుక్ ఖాన్ పాట పాడి నెట్టింట్లో మరింత ఫేమస్ అయ్యాడు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ - అల్లు అయాన్​కు వస్తున్న క్రేజ్​ చూసి అతడిని కూడా సినిమా ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఇందుకోసం పుష్ప 2లో ఓ పాత్రను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. కెమియోగా పుష్ప 2లో అయాన్ కనిపిస్తాడని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ నిజమైతే బాగుండని అల్లు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణల్లో బన్నీ పిల్లలు

అదరగొట్టిన అల్లు అయాన్.. బన్నీ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్

Last Updated : Feb 25, 2024, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details