September Movies 2024:వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7న అయితే రెండ్రోజుల ముందు నుంచే సినిమా పండుగ మొదలైపోనుంది. అలా మొదలైన వరుస సినిమాలు సినీ ప్రేక్షకులకు నెల మొత్తం కన్నుల విందు కానున్నాయి. 'ది గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్' (ది గోట్)తో దళపతి విజయ్ గ్రాండ్ ఓపెనింగ్ చేయనున్నాడు. వెంకట్ ప్రభు డైరక్షన్‌లో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. నెల చివర్లో అంటే సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 వరకూ లైను పెట్టిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పండగే పండగ.
ది గోట్:విజయ్ దళపతి హీరోగా రెడీ అవుతున్న 'ద గోట్' సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారు. మీనాక్షి చౌదరీ హీరోయిన్. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి దివంగత నటుడు విజయ్ కాంత్ కూడా ఇందులో కనిపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంచనాలకు అతీతంగా సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే ఉంటాయని డైరక్టర్ చెబుతున్నారు.
35 చిన్న కథ కాదు: నివేదా ధామస్ ప్రధాన పాత్రలో రెడీ అవుతున్న '35 చిన్న కథ కాదు' కామెడీతో పాటు ఆలోచింపజేసే కథతో ముస్తాబుకానుంది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలో ఆర్. ప్రియదర్శి నటిస్తున్నారు. నందకిశోర్ ఇమాని రూపొందించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న రానా సమర్పణలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సుందరకాండ:చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన సినిమా రిలీజ్ కానుంది. 'సుందరకాండ' అనే లవ్ స్టోరీతో ఒకే రోజున అంటే సెప్టెంబర్ 6నే రిలీజ్ కానుంది. నారా రోహిత్ సరసన విర్తి వాఘవి హీరోయిన్ గా కనిపించనున్నారు. దీనికి దర్శకత్వం వెంకటేశ్ నిమ్మలపూడి వహిస్తున్నారు.
ఎమర్జెన్సీ: కాంట్రవర్షియల్ హీరోయిన్, బాలీవుడ్ నటి అయిన కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో ఓ బయోపిక్‌తో రానుంది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్న ఆమె అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భాన్ని తీసుకుని కథ సిద్ధం చేసుకున్నారు. ఇది కూడా రిలీజ్ అయ్యేది సెప్టెంబర్ 6నే.