Saripodhaa Sanivaaram US Bookings :నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. ఇప్పటికే ట్రైలర్, టీజర్, ప్రమోషనల్ ఈవెంట్స్‌తో భారీ స్థాయిలో హైప్ పొందిన ఈ చిత్రం మరికొద్ది గంటల్లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ ఈ చిత్రం చూడటానికి ఆడియెన్స్ ఓ రేంజ్లో ఆసక్తి చూపిస్తున్నట్లు అక్కడి బుక్సింగ్ ద్వారా తెలుస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ అందించిన అప్డేట్ ప్రకారం 'సరిపోదా శనివారం' ఓవర్సీస్ ప్రీమియర్లకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయట. అక్కడి బుకింగ్ ద్వారా ఏకంగా 17,000కు పైగా ప్రీమియర్ టికెట్లు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ వసూలు చేయగా, ఇప్పుడీ ఆ సంఖ్య పెరిగినట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు అమెరికాలో వసూళ్లను కూడా కలుపుకుంటే సినిమా కోట్ల వర్షం కురిపిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.