తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సంక్రాంతి సినిమాల OTT డేట్స్​ - ఏ సినిమా ఎప్పుడంటే? - నా సామి రంగ ఓటీటీ రిలీజ్

Sankranthi OTT Releases: ఈ సంక్రాంతి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్​ ముగింపు దశకు వచ్చేశాయి. దీంతో ఇక డిజిటల్ స్ట్రీమింగ్​కు రెడీ అవుతున్నాయి. వాటి వివరాలు.

సంక్రాంతి సినిమాల OTT డేట్లు - ఏ సినిమా ఎప్పుడంటే?
సంక్రాంతి సినిమాల OTT డేట్లు - ఏ సినిమా ఎప్పుడంటే?

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 12:12 PM IST

Sankranthi OTT Releases : ఈ సంక్రాంతి బాక్సాఫీస్ సీజన్​​ లెక్క చివరి దశకు వచ్చేసింది. ఈ పండగ బరిలో దిగిన సినిమాల ఓటీటీ ప్రీమియర్ల కోసం అభిమానులు ఎదురు చూడటం మొదలుపెట్టేశారు. ఒక్క హనుమాన్ మూవీ తప్ప మిగిలినవి బాగానే నెమ్మదించిపోయాయి. ఇక ఇవన్నీ డిజిటల్​లో రావడమే బాకీ. అయితే వీటిలో ముందుగా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్న చిత్రం 'సైంధ‌వ్‌'. అంచనాలతో వచ్చిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా మరీ ఇంత దారుణంగా నిరాశ పరుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫిబ్రవరి 2 నుంచి అమెజాన్ ప్రైమ్​లో రావొచ్చని డిజిటల్ టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇందులో మార్పు జరిగితే వచ్చే వారంకు వాయిదా పడొచ్చు.

కింగ్​ నాగార్జునకు చాలా కాలం తర్వాత సూపర్ హిట్ అందించిన సినిమా 'నా సామిరంగ'. ఫిబ్రవరి 15 నుంచి హాట్​ స్టార్​లో ఇది స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మహేశ్ బాబు 'గుంటూరు కారం'(Guntur Kaaram OTT Release Date) సలార్ తరహాలో కేవలం ఇరవై ఎనిమిది రోజుల గ్యాప్​లోనే స్ట్రీమింగ్​ అయ్యే అగ్రీమెంట్ ఉంటే ఫిబ్రవరి 9 నుంచే నెట్ ఫ్లిక్స్​లో అందుబాటులో ఉంటుంది. లేదంటే అంటే నలభై ఐదు రోజుల గ్యాప్​లో వస్తుంది.

ఇక సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్​గా నిలిచిన 'హనుమాన్'ను(Hanuman OTT Release Date) జీ5 సంస్థ సొంతం చేసుకుంది. అగ్రీమెంట్​ ప్రకారం ఇది మూడు వారాల్లోనే రావాలి. కానీ రెస్పాన్స్ భారీగా రావడంతో ఇప్పుడు దీన్ని మార్చి మూడో వారానికి షిఫ్ట్ చేశారట. కాబట్టి మొత్తంగా వచ్చే నెలన్నారలోపు మొత్తం నాలుగు సినిమాలు ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు అనమాట.

ఇవి కాకుండా రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో విడుదలైన ధనుశ్​ కెప్టెన్ మిల్లర్ మరో పది రోజుల్లో ఓటీటీలోకి వచ్చేలా కనిపిస్తోంది. ఇక తెలుగులో వాయిదా పడ్డ అయలాన్​కు డిజిటల్ ప్రమోషన్స్ మొదలైపోయింది. సన్​ నెక్ట్స్​ త్వరలోనే దీన్ని విడుదల చేయనుందని తెలుస్తోంది.

చైనీస్‌, ఇండోనేషియా, కొరియన్​లో రీమేకైన తొలి ఇండియన్​ మూవీ ఈయనదే!

వామ్మో 'పుష్ప 2' బడ్జెట్​ అంత పెరిగిందా? - ఏకంగా ఎన్ని కోట్లంటే?

ABOUT THE AUTHOR

...view details