తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నాలుగేళ్లు ఫుల్ బిజీ - 'స్పిరిట్' రిలీజ్ అప్పుడే: సందీప్ వంగా - Prabhas Sandeep Spirit - PRABHAS SANDEEP SPIRIT

Prabhas Sandeep Spirit : 'యానిమల్‌'తో విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్‌ రెడ్డి తన తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ప్రభాస్​తో తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' సినిమా విడుదల గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Prabhas Sandeep Spirit
Prabhas Sandeep Spirit (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 6:23 PM IST

Prabhas Sandeep Spirit : 'అర్జున్ రెడ్డితో' సంచలనం సృష్టించి 'యానిమల్‌'తో పాన్​ ఇండియా లేవల్​లో ఇటీవల విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. తాజాగా ఆయన తన తదుపరి చిత్రాలను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌ హీరోగా తాను తెరకెక్కించనున్న 'స్పిరిట్‌'కు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

'రెండు కీలక ప్రాజెక్ట్ ఉన్నాయి'
'ప్రస్తుతం నా చేతిలో రెండు కీలక ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇప్పటికే వాటికి సంబంధించిన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నా. రానున్న నాలుగేళ్లు ఆ సినిమాలతో బిజీగా ఉండనున్నా. ప్రభాస్‌ హీరోగా నటించనున్న 'స్పిరిట్‌' ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించా. త్వరలోనే సెట్స్‌పైకి తీసుకువెళ్తా. రానున్న రెండేళ్లలో సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తా. ఆ తర్వాత 'యానిమల్‌'కు కొనసాగింపుగా రానున్న 'యానిమల్‌ పార్క్‌'పై దృష్టి పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు తప్ప నాకు మిగతా ప్లాన్స్ ఏమీ లేవు' అని సందీప్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పోలీసుగా ప్రభాస్
ఇక 'స్పిరిట్‌' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో టీ సిరీస్‌ బ్యానర్‌పై నిర్మితం కానుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టే అవకాశముందని గతంలో నిర్మాత భూషణ్‌ కుమార్‌ అన్నారు. 'ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. పోలీస్‌ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు' అని తెలిపారు.

'యానిమల్‌ పార్క్‌' విషయానికి వస్తే, గతేడాది విడుదలైన 'యానిమల్‌'కు సీక్వెల్‌గా రానుంది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా నటించిన 'యానిమల్‌' బాక్సాఫీస్‌ వద్ద భారీగా వసూళ్లు చేసింది. సినిమాలో తీవ్ర హింస, పలు సన్నివేశాల్లో స్త్రీని తక్కువ చేసి చూపించారని పలువురు సినీ ప్రముఖులు, విశ్లేషకులు విమర్శించారు.

'స్పిరిట్'​లో ప్రభాస్ లుక్​ ఇదేనట! - Prabhas Spirit Movie

'స్పిరిట్' ఫస్ట్​డే కలెక్షన్ రూ.150 కోట్లు పక్కా!- ప్రభాస్ ఇమేజ్​తో ఇది సాధ్యమే'- సందీప్ వంగా - Prabhas Sandeep Spirit

ABOUT THE AUTHOR

...view details