తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'స్పిరిట్' నుంచి నాలుగు అప్డేట్స్!​ - రంగంలోకి ఇద్దరు మెగాస్టార్స్​, ఓ బాలీవుడ్ హీరోయిన్ - PRABHAS SPIRIT MOVIE

'స్పిరిట్'​ కోసం సందీప్ వంగా భారీ ప్లాన్ - సిద్ధమవుతున్న మెంటల్ మాస్ కాంబినేషన్​!

Prabhas Sandeep Reddy Vanga
Prabhas Sandeep Reddy Vanga (source ETV Bharat IANS)

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 3:33 PM IST

Sandeep Reddy Vanga Prabhas Spirit Movie : ఇంకా షూటింగ్​ మొదలుకానప్పటికీ 'స్పిరిట్'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అర్జున్​ రెడ్డి, కబీర్​ సింగ్​తో డెబ్యూ హిట్ అందుకుని ఆ తర్వాత యానిమల్​తో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి వంగా స్పిరిట్​ను తెరకెక్కిస్తున్నారు. పైగా ఇందులో ప్రభాస్​ నటించబోతుండడంతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ప్రస్తుతం ఈ 'స్పిరిట్' సినిమా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. గ్యాప్ లేకుండా ఫ్యాన్స్​ దీన్ని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే స్పిరిట్ గురించి మరింత హైప్ పెంచేలా ఏకంగా నాలుగు అప్డేట్స్​ బయట చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే సినిమాలో ఏకంగా ఇద్దరు మెగాస్టార్స్​ నటించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పాటే ఓ బాలీవుడ్ హీరోయిన్ కూడా దాదాపుగా కన్ఫామ్​ అయిపోతుందని చెబుతున్నారు. స్పిరిట్ సెట్స్​పైకి ఎప్పుడు వెళ్లనుందో కూడా సమాచారం బయటకు వచ్చింది.

ఇంతకీ వారెవరంటే? - ఓ కీలక పాత్ర కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని సందీప్ రెడ్డి సంప్రదించారట. అలానే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని(Spirit Chiranjeevi) కూడా సందీప్ వంగా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా కరీనా కపూర్​ నటించబోతున్నట్లు కూడా ప్రచారం సాగింది. ఇప్పుడు ఇది కూడా కన్ఫామ్ అయినట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అలా ఈ ముగ్గురు ప్రభాస్​ స్పిరిట్ కోసం పని చేస్తారనే సమాచారం బయటకు రావడంతో 'స్పిరిట్' గ్యాప్​ లేకుండా ట్రెండ్​ అవుతూ ఫ్యాన్స్​లో ఫుల్ జోష్ నింపుతోంది. ఒకవేళ వీళ్లంతా నిజంగా స్పిరిట్​లో నటిస్తే మాత్రం ఈ సినిమా పక్కా మెంటల్ మాస్ కాంబినేషన్ అవుతుంది.

Spirit Movie Shooting : కాగా, స్పిరిట్​ సినిమా 2025 జనవరిలో సెట్స్​పైకి వెళ్లే అవకాశముందని కూడా ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రం పోలీస్‌ డ్రామాగా తెరకెక్కనుంది. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. టి సిరీస్​ భూషణ్‌కుమార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రామ్​చరణ్, ప్రశాంత్ నీల్ కాంబో ఫిక్స్- షూటింగ్ ఎప్పుడంటే? - Ram Charan Prashanth Neel Movie

'పుష్ప 2' కోసం ఫహాద్ ఫాజిల్​ రెమ్యునరేషన్ ఇదే - ఫస్ట్ పార్ట్ కన్నా ఎంత ఎక్కువంటే?

ABOUT THE AUTHOR

...view details