తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ట్రెండింగ్​లో 'దేవర' - ఒకేసారి 4 లేటెస్ట్ అప్డేట్స్​! - NTR Devara Movie - NTR DEVARA MOVIE

NTR Devara Movie : యంగ్ టైగర్​ ఎన్టీఆర్‌ నటించిన 'దేవర' సోషల్‌ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్​ చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
NTR Devara Movie (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 3:41 PM IST

NTR Devara Movie :గత కొద్ది రోజులుగా గ్యాప్​ లేకుండా యంగ్ టైగర్​ ఎన్టీఆర్‌ నటించిన దేవర సోషల్‌ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మూవీ లవర్స్​, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు విడుదలైన దేవరలోని పాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు దేవర ట్రైలర్‌ రిలీజ్ అప్డేట్ రావడంతో, ఎన్టీఆర్‌ ప్రమోషన్స్‌ కోసం ముంబయి వెళ్లి దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాను కలవడంతో ఎన్టీఆర్​, సందీప్​ వంగా, దేవర పేర్లు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, తారక్ ఫ్యాన్స్​ ఈ పేర్లతో హ్యాష్​ ట్యాగ్​లను బాగా వైరల్ చేస్తున్నారు.

ట్రైలర్‌ ఎప్పుడంటే(NTR Devara Trailer) - దేవర సినిమా పక్కా యాక్షన్‌ డ్రామాగా ముస్తాబవుతోంది. అయితే ఈ మూవీ ట్రైలర్​ను రేపు(సెప్టెంబర్ 10) రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది. సెప్టెంబర్‌ 10 సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఓ స్పెషల్ పోస్టర్​ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో తారక్​ పవర్‌ ఫుల్​గా కనిపిస్తున్నారు. కత్తి పట్టుకొని సముద్రంలో నడుస్తున్నట్లు కనిపించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్​ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సందీప్‌రెడ్డి వంగాను కలిసిన తారక్(NTR Devara Sandeep vanga)​ - దేవర సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ముంబయి వెళ్లారు ఎన్టీఆర్‌. అక్కడ ఆయన ప్రముఖ దర్శకుడు సందీప్‌ వంగాను కలిసి ముచ్చటించారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో బయటకు వచ్చింది. దీంతో ఫ్యాన్స్​, సినీ ప్రియుల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం సందీప్ వంగా ప్రభాస్​ స్పిరిట్‌ కోసం రెడీ అవుతున్నారు. దీని తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశముందని కొంతమంది అనుకుంటున్నారు. మరికొందరు దేవర ప్రమోషన్‌ భాగంగా సందీప్‌ వంగా ఈ టీమ్‌ను ఇంటర్వ్యూ చేస్తుందని భావిస్తున్నారు.

వన్‌ మిలియన్‌ టికెట్స్‌(NTR Devara Pre Sales) -దేవర సినిమా సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. రీసెంట్​గా ఓవర్సీస్‌లో ఈ మూవీ ప్రీసేల్‌ బుకింగ్స్ ఓపెన్‌ అయ్యాయి. దీంతో టికెట్స్ హాట్‌ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. కొన్ని గంటల్లోనే 8 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. ట్రైలర్ రిలీజ్‌ కన్నా ముందే ఈ స్థాయిలో సేల్ అవ్వడం విశేషం. టికెట్ సేల్స్​ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. దీంతో ట్రైలర్‌ విడుదల కాన్నా సేల్స్​లో వన్‌ మిలియన్‌ మార్క్‌ చేరుకుంటుందని అంతా అనుకుంటున్నారు.

యూట్యూబ్‌ టాప్‌లో దావూదీ(NTR Devara Daavudi song) - దేవర సినిమా నుంచి రీసెంట్​గా రిలీజైన దావూదీ సాంగ్​ యూట్యూబ్​లో ఫుల్ ట్రెండింగ్​ అవుతోంది. టాప్​లో కొనసాగుతోంది. ఈ సాంగ్​ను రామజోగయ్య శాస్త్రి రచించారు. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులో ఎన్టీఆర్‌ డ్యాన్స్‌, జాన్వీ కపూర్‌ అందం, ఈ ఇద్దరి కెమిస్ట్రీ మంచి రెస్పాన్స్​ వస్తోంది.

ఇకపోతే దేవర సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారేజ్‌ తర్వాత ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న చిత్రమిది. జాన్వీ కపూర్‌ హీరోయిన్. ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది.

'దావూదీ' జాన్వీ డ్యాన్స్ - హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌ అయిన మూడో రోజుల్లోనే షూటింగ్​! - Janhvi Kapoor Devara

ఓవర్సీస్​లో 'దేవర' మేనియా- 6 నిమిషాల్లోనే ప్రీ బుకింగ్స్ సోల్డ్​ ఔట్! - Devara Overseas Pre Sales

ABOUT THE AUTHOR

...view details