తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

యాక్షన్‌ థ్రిల్లర్‌లో మల్లు బ్యూటీ - సర్​ప్రైజింగ్​గా సంయుక్త కొత్త సినిమా అనౌన్స్​మెంట్! - SAMYUKTHA MENON ACTION FILM

యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ తాజాగా ఓ యాక్షన్ ఫిల్మ్​కు సైన్ చేసింది. తాజాగా ఆ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్​గా ప్రారంభమైంది. ఆ వివరాలు మీ కోసం.

Samyuktha Menon Action Film
Samyuktha Menon (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 1:09 PM IST

Samyuktha Menon Action Film :'సార్', 'విరూపాక్ష' లాంటి వరుస హిట్ సినిమాలతో అలరిస్తున్న మల్లు బ్యూటీ సంయుక్త మేనన్​ ఇప్పుడు యాక్షన్​ జానర్​లో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది.

నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్​గా ప్రారంభమైంది. ఈ వేడుకకు నిర్మాతలు దిల్‌ రాజు, కోనా వెంకట్‌తో పాటు టాలీవుడ్ హీరో రానా ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. యోగేశ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్‌ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ వేడుకలో హీరోయిన్ సంయుక్త మేనన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంలో నటించడం తనకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.

"ఇదంతా ఓ కలలానే ఉంది. ఈ స్టోరీ వినాలని నేను రెండు నెలల నుంచి అనుకుంటున్నాను. కథ వినగానే ఓకే చెప్పేశాను. కథ ఎంతో ఇంట్రెస్టింగ్​గా ఉంది. డైరెక్టర్ దీనికోసం కొన్ని సంవత్సరాల పాటు కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో నేను నటించిన సినిమాలన్నీ హిట్‌గా నిలిచాయని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రెడిట్‌ అంతా మా మేనేజర్‌దే. నా స్టోరీలన్నీ మొదట ఆయనే సెలెక్ట్‌ చేస్తారు. ఈ కథ వింటున్నంతసేపు నాకు నా జర్నీ గుర్తొచ్చింది. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సినిమాకు స్క్రిప్ట్‌ మాత్రమే ప్రధానం. అది బాగుంటే సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది" అని సంయుక్త పేర్కొంది.

ఇక సంయుక్త ప్రస్తుతం 'స్వయంభు' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ లీడ్​ రోల్​లో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు ఆమె మరో నాలుగు ప్రాజెక్టులకు సైన్ చేసింది. అందులో కొన్ని షూటింగ్ దశలో ఉండగా, మరికొన్ని చిత్రీకరణను పూర్తి చేసుకున్నాయి.

'సంయుక్త ప్లీజ్ రావొచ్చుగా'- హీరోయిన్​కు SRH ఫ్యాన్స్ రిక్వెస్ట్!

ABOUT THE AUTHOR

...view details