Samantha Rana Bangalore Days OTT Telugu :ఓటీటీలో ఎన్నో తెలుగు సినిమాలతో పాటు వివిధ భాషల్లో తెరకెక్కిన చిత్రాలు కూడా తెలుగులో డబ్ అయి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే తాజాగా ఎనిమిదేళ్ల క్రితం తమిళంలో రీమేక్ అయిన సినిమాను ఇప్పుడు తెలుగు భాషలోకి డబ్ చేసి వదిలారు. ఆ సినిమా మరేదో కాదు బెంగళూరు డేస్. మరో విషయం ఏంటంటే ఇందులో రానా, సమంత కలిసి నటించడం విశేషం. వాస్తవానికి రానా, సమంత కలిసి ఓ సినిమాలో నటించరానే విషయం దాదాపుగా చాలా మందికి తెలీదు. వీరిద్దరి కలిసి నటించిన తొలి సినిమా ఇదే. తర్వాత మరే చిత్రంలోనూ కనిపించలేదు.
2014లో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది బెంగళూరు డేస్. ఇందులో దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్, నజ్రియా, పార్వతి తిరువోతు, నివిన్ పౌలీ కలిసి నటించారు. ఈ చిత్రాన్నే 2016లో తమిళంలో రీమేక్ చేశారు. ఇందులో శ్రీదివ్య, బాబీ సింహా, లక్ష్మీ రాయ్, స్టార్ హీరోయిన్ సమంత, దగ్గుబాటి రానా, తమిళ హీరోఆర్య కలిసి నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ కూడా థియేటర్లలో విడుదల చేద్దామని అనుకున్నారు మేకర్స్. కానీ పలు కారణాల వల్ల కుదరలేదు. దీంతో అప్పటి నుంచి తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.
అయితే ఇప్పుడు ఎట్టకేలకు తెలుగులోకి విడుదల చేశారు. అది కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోకి. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. బెంగళూరు డేస్ టైటిల్‌తోనే ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సబ్స్క్రిప్షన్ ఉంటేనే చూడగలం. ఒరిజినల్ మలయాళ వెర్షన్ మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది.