ETV Bharat / entertainment

వరుణ్‌ తేజ్‌ - గ్యాంగ్​స్టర్ డ్రామా​ 'మట్కా' ఎలా ఉందంటే? - MATKA MOVIE REVIEW

వరుణ్‌ తేజ్‌ హీరోగా కరుణ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం 'మట్కా' రివ్యూ ఇదే!

Matka Movie Review
Matka Movie Review (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 3:11 PM IST

Matka Movie Review : జయాపజయాలతో సంబంధం లేకుండా భిన్నమైన కథలతో కెరీర్​లో ముందుకెళ్తున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. తాజాగా ఆయన మట్కా చిత్రంతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. పలాసతో ఆకట్టుకున్న కరుణ కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. వరుణ్‌ భిన్నమైన గెటప్పుల్లో కనిపించడంతో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. మరి ఇంతకీ ఈ చిత్ర కథేంటి? సినీ ప్రియులను ఆకట్టుకుందా తెలుసుకుందాం.

కథేంటంటే? - బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థిగా వచ్చిన కుర్రాడు వాసు (వరుణ్‌ తేజ్‌) అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తిని హత్య చేసి చిన్నతనంలోనే జైలుకు వెళ్తాడు. అక్కడి జైలు వార్డెన్‌ నారాయణ మూర్తి (రవిశంకర్‌) తన స్వప్రయోజనాల కోసం వాసును ఓ ఫైటర్‌లా మారుస్తాడు. వాసు జైలు నుంచి రిలీజయ్యాక పని వెతుక్కుంటూ పూర్ణ మార్కెట్‌కు చేరుకుంటాడు. కొబ్బరికాయల వ్యాపారి అప్పలరెడ్డి (అజయ్‌ ఘోష్‌) దగ్గర పనికి చేరుతాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఓ గొడవలో కె.బి.రెడ్డి (జాన్‌ విజయ్‌) రౌడీ గ్యాంగ్‌ను చితక్కొట్టి అతడి ప్రత్యర్థి నానిబాబు (కిషోర్‌)కు దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడి సపోర్ట్​తో పూర్ణ మార్కెట్‌కు లీడర్​గా ఎదుగుతాడు. మరి అక్కడి నుంచి వాసు జర్నీ ఎలా సాగింది? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? అనేదే ఈ చిత్ర కథ.

ఎలా ఉందంటే? - పుష్ప, కేజీయఫ్‌ కథ తరహాలోనే ఈ కథను తెరకెక్కించేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ కథలో బలమైన సంఘర్షణ కనిపించలేదు. ఈ కథ ప్రధానంగా మట్కా అనే ఆట చుట్టూనే సాగుతుంది. అనామకుడైన హీరో ఈ ఆట ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థనే సంక్షోభంలోకి నెట్టగలిగేంత స్థాయికి ఎలా ఎదిగాడన్నది కథాంశం. కానీ ఆటలో ఎలాంటి మెరుపులు కానీ, థ్రిల్లింగ్‌ మూమెంట్లు కానీ కనిపించవు. సినిమా ఏ దశలోనూ ఆసక్తిరేకెత్తించదు. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు చప్పగా సాగుతాయి.

సెకండాఫ్​లో దేశ ఆర్థిక వ్యవస్థకు అడ్డంకిగా మారిన మట్కా ఆట కట్టించేందుకు, దాన్ని వెనక ఉండి నడిపించే వాసును పట్టుకునేందుకు అధికారులు, అలానే వాసుని పడగొట్టేందుకు తన ప్రత్యర్థులు వేసే ఎత్తులు ఇలా కథ అంతా సాగుతుంటుంది. అయితే ఇవన్నీ పెద్దగా గొప్పగా ఏమీ అనిపించవు. ప్రీక్లైమాక్స్‌లో హీరో తన కూతురుకు చెప్పే మేక-నక్క కథ ప్రేక్షకుల సహనానికి ఓ పరీక్షనే చెప్పాలి. క్లైమాక్స్​లో హీరో ఆరు బుల్లెట్లున్న రివాల్వర్‌తో ఇరవై, ముప్పై మంది రౌడీల్ని చంపేయడం విడ్డూరంగా అనిపిస్తుంది! ఫైనల్​గా సినిమాను ముగించిన తీరు కూడా ఆసక్తిగా అనిపించదు.

ఎవరెలా చేశారు? - ఈ సినిమాలో వాసు మూడు కోణాల్లో సాగే పాత్రలో కనిపించారు. వరుణ్ నటన బాగుంది. వయసు పైబడిన పాత్రలో బాగున్నాడు. యాక్షన్‌ సీక్వెన్స్​లోనూ ఆకట్టుకున్నాడు. మీనాక్షి డీగ్లామర్‌ లుక్‌లో బాగానే అనిపించింది. కానీ, ఆమె పాత్రకు కథలో ప్రాధాన్యం దక్కలేదు. హీరోతో లవ్‌ట్రాక్‌ కూడా రొటీన్‌గానే సాగింది. సోఫియాగా నోరా ఫతేహి అందాల ప్రదర్శన చేసింది. కిషోర్, జాన్‌ విజయ్, నవీన్‌ చంద్ర, సలోని, అజయ్‌ ఘోష్‌ వీరి పాత్రలంతా బలంగా కనిపించలేదు. దర్శకుడు కరుణ కుమార్‌ రాసుకున్న కథలో కొత్తదనం లేదు. జీవీ ప్రకాశ్‌ సంగీతం సినిమాకు ఆకర్షణగా నిలిచింది. ఆర్ట్‌ వర్క్, ఛాయాగ్రహణం కథకు తగ్గట్లుగా బానే ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

చివరిగా : 'మట్కా' నిరుత్సాహపరిచే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా!

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఓటీటీ డీటెయిల్స్​ - ఈ సినిమా ఓటీటీ రైట్స్​ను అమెజాన్ కొనుగోలు చేసింది. ఈ చిత్రం డిసెంబర్​లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.

సూర్య పీరియాడికల్ డ్రామా - 'కంగువా' మూవీ ఎలా ఉందంటే?

మీనాక్షి చౌదరి ఆన్ డిమాండ్ - 4 సినిమాలు పూర్తి​, మరో 8 రోజుల్లో ఇంకో 2 చిత్రాలతో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.