ETV Bharat / state

కుటుంబ సర్వే : ఫ్రిజ్​లు, ఏసీలు, కార్లు ఉన్నవారికి సంక్షేమ పథకాలు కట్! - క్లారిటీ ఇచ్చిన మంత్రి - TG SAMAGRA KUTUMBA SURVEY

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే - జీహెచ్​ఎంసీ మేయర్ ఇంటికి వెళ్లి సర్వే స్థితిని తెలుసుకున్న మంత్రి పొన్నం - ఆస్తుల వివరాలు వెల్లడిస్తే ప్రభుత్వ పథకాలు ఆగిపోవన్న మంత్రి

Telangana Samagra Kutumba Survey
Telangana Samagra Kutumba Survey (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2024, 2:20 PM IST

Updated : Nov 14, 2024, 2:27 PM IST

Telangana Samagra Kutumba Survey : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6 నుంచి ఇళ్ల గుర్తింపు కార్యక్రమం, అలాగే 9వ తేదీ నుంచి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైంది. సర్వే మొత్తం సాఫీగానే సాగుతోంది. కానీ హైదరాబాద్​లో అక్కడక్కడ సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లను యజమానులు దూషించడం, వివరాలు ఇవ్వడం జరగదు అని చెబుతున్న కొన్ని ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే సర్వేలో ఫ్రిజ్​లు, టీవీలు, ఏసీలు, కారు, ద్విచక్ర వాహనం ఇలా అన్ని వివరాలు వెల్లడిస్తే ప్రస్తుతం వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని కొందరు సోషల్​ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్​ మేయర్​ గద్వాల విజయలక్ష్మి ఇంట్లో జరుగుతున్న సర్వేను పర్యవేక్షించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.

'సర్వే సమాచారం గోప్యంగా రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తుంది. ఈ సమాచారం సేకరించడంతో ఎవరికీ కూడా ఏ ప్రభుత్వ పథకాలు నిలిచిపోవు. ఇంకా అదనంగా పథకాలు ఇవ్వడానికి సేకరిస్తున్న సమాచారాన్ని ఉపయోగిస్తాం. దీన్ని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు. దీనిపై అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా, పారదర్శకంగా ప్రభుత్వం సమాచారం సేకరిస్తుంది. ఈ సర్వేకు రాజకీయాలతో సంబంధం లేదు. కేబినెట్​ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించిన తర్వాత సర్వే చేస్తున్నాం. ఎన్యూమరేటర్లపై దూషణలకు దిగితే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.' అని మంత్రి పొన్నం ప్రభాకర్​ తేల్చి చెప్పారు.

తెలంగాణ ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్​ హర్షం వ్యక్తం చేశారు. ఈ సర్వేతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం సర్వే జరగ్గా, జీహెచ్​ఎంసీ పరిధిలో 4.50 లక్షల ఇళ్లకు సర్వే పూర్తి అయిందని తెలిపారు. రాష్ట్రంలో 85 వేల పైగా ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రినే స్పందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆనందించారు.

మీ బ్యాంక్​ అకౌంట్​ డీటైల్స్​ అడగం : 'మీ బ్యాంక్​ అకౌంట్​ డీటైల్స్​ అడగడం లేదు. ఉందా లేదా అని సమాచారం మాత్రమే అడుగుతున్నారు. బ్యాంక్​ ఖాతాకు ఆప్షన్​ అడుగుతున్నాం. ఆధార్​ కార్డు తప్పనిసరి కాదు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించాలి. గతంలో సర్వే చేయాలని అనేక దీక్షలు, ధర్నాలు చేసిన వారు సైలెంట్​గా ఉన్నారు. అందరూ సర్వేను స్వాగతిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరూ లేరు. ఐడెంటీ కార్డు ఉంటుంది. వాళ్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్నారు. సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయి. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.' అని మంత్రి స్పష్టం చేశారు.

ఇంటికి వెళితే ఉండరు - ఆస్తి వివరాలు అడిగితే చెప్పరు - ఎన్యూమరేటర్లకు తప్పని సర్వే అష్టకష్టాలు

కులగణనను బహిష్కరించిన 17 తండాల ప్రజలు - ఎక్కడంటే?

Last Updated : Nov 14, 2024, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.