ETV Bharat / entertainment

చెర్రీ కోసం షారుక్ ఖాన్! - 'గేమ్ ఛేంజర్' మేకర్స్ భారీ ప్లాన్! - RAM CHARAN GAME CHANGER

ఆ ఈవెంట్​ కోసం 'గేమ్ ఛేంజర్' మేకర్స్ భారీ ప్లాన్! - చెర్రీ కోసం రానున్న బాలీవుడ్ బాద్​షా

Game Changer Pre Release Event
Ram Charan, Shahrukh Khan (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 1:19 PM IST

Game Changer Pre Release Event : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ ఓ వైపు శరవేగంగా చిత్రీకరణ పనులు జరుపుకుంటూనే మరోవైపు ప్రమోషన్స్​తోనూ నెట్టిటం సందడి చేస్తోంది. ఇటీవలే టీజర్ లాంఛ్​ ఈవెంట్​ కూడా గ్రాండ్​గా జరిగి అభిమానులను తెగ ఆకట్టుకుంది. అయితే తాజాగా గేమ్​ ఛేంజర్​కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

సాధారణంగా డైరెక్టర్ శంకర్ తన మూవీ ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్​లో చేయడం మనం చాలా సార్లు చూసుంటాం. ముఖ్యంగా ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఈయన హాలీవుడ్ స్టార్స్​ను ఆహ్వానించిన సందర్భాలూ ఉన్నాయి. అలా ఇపుడు ఈ 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం శంకర్​ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి ఈ ఈవెంట్​కు బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​ని ఇన్వైట్ చేసే ప్లాన్​లో ఉన్నారట. అయితే ఈ రూమర్​లో ఎంతవరకు నిజం ఉందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

చెర్రీ డ్యూయెల్ రోల్​
మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాలేజీ స్టూడింట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా మారిన రామ్ చరణ్ విలన్‌లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథగా చూపించనున్నట్లు అర్థమవుతోంది. మరో పాత్రలో చరణ్ రైతు నాయకుడిగా కనిపించనున్నారు. మొత్తంగా ఈ సినిమా టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో పవర్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటం వల్ల అభిమానులు బాగా థ్రిల్ అవుతున్నారు.

ఇక ఈ మూవీలో అంజలీ, యస్​ జే సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్​ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు భారీ బడ్జెట్​తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషనల్ ఈవెంట్స్​ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సంక్రాంతి రేసులో 4 సినిమాలు! - అయినా ఈ సీజన్‌ వారిద్దరిదే!

'నన్ను ఎవరూ అంచనా వేయలేరు' - రామ్‌చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్' టీజర్‌ వచ్చేసిందోచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.