Mammootty Samantha : కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ సమంత ప్రస్తుతం కొత్త చిత్రాలను లైన్లో పెట్టే పనిలో ఉందట. అలా తాజాగా ఆమె మాలీవుడ్ మెగాస్టార్‌తో సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మమ్ముట్టి ఫుల్ ఫామ్‌లో ఉంటూ వివిధ జానర్లలో సూపర్ హిట్‌లు అందుకుంటున్నారు. రీసెంట్‌గా ఆయన తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్‌తో ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంలోనే సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయట.
ఒకవేళ ఇదే కనుక నిజమై సమంత కన్ఫామ్ అయితేే ఆమెకు ఇది బంపర్ ఆఫరే అని చెప్పాలి. అలానే గౌతమ్ మేనన్‌తో ఆమెకు ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుంది. గతంలో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో 'ఏమాయ చేశావే', 'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రాలతో సామ్ మంచి పేరు సంపాదించుకుంది. ఇందులో ఏమాయ చేశావే సమంతకు డెబ్యూ మూవీ.
కాగా, మమ్ముట్టి చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 15న చెన్నైలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. జూన్ 20న మమ్ముట్టి సెట్స్‌లో జాయిన్ అవుతారట. మమ్ముట్టినే దీన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే గతంలో మమ్ముట్టి- సమంత కలిసి ఓ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే.