Salman Khan Production House :తన పేరుపై ఓ ఫేక్ ప్రొడక్షన్ హౌస్‌ను క్రియేట్ చేసి కొందరు మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారంటూ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టీమ్ పేర్కొంది. అయితే వారిని నమ్మొద్దంటూ టీమ్ తాజాగా హెచ్చరించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పి అవకాశాలు ఇస్తామని మోసం చేసేందుకు యత్నిస్తున్నారంటూ సల్మాన్ టీమ్ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది.
"సల్మాన్ ఖాన్, ఆయన ప్రొడక్షన్ హౌస్ ప్రస్తుతం ఏ సినిమాకు ఆడిషన్స్‌ను నిర్వహించడం లేదు. ఇందుకోసం ఏ ఏజెన్సీని కూడా నియమించుకోలేదు. మా పేరుతో వచ్చే ఫోన్లు, ఈమెయిల్స్‌ను అస్సలు నమ్మొద్దు. అలా మోసం చేసే వారిపై త్వరలోనే మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఆయన పేరును ఉపయోగించి నేరాలకు పాల్పడితే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అంటూ సల్మాన్ టీమ్ వార్నింగ్ ఇచ్చింది.
అయితే ఇలా సల్మాన్ పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ కొందరు ఇలా ఫేక్ ఈమెయిల్స్ చేస్తే, అప్పుడు కూడా టీమ్ స్పందించింది. 2011లో సల్మాన్‌ఖాన్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ప్రారంభించారు. దీనినుంచి వచ్చే డబ్బులను ఆయన ఛారిటీకి ఉపయోగిస్తారు.