Saipallavi Premam Movie Rerelease Collections : మలయాళం కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ మూవీ 'ప్రేమమ్'. ఈ సినిమా అపట్లో ఎంతటి విజయం సాధించిందో సినీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఇందులో మలయాళ హీరో నవీన్ పాల్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కలిసి నటించారు. ఈ చిత్రంలో ఓ యువకుడి జీవితంలో మూడు దశల్లో సాగిన ప్రేమాయణాన్ని అద్భుతంగా చూపించారు. అయితే ఇప్పుడీ సినిమా రీరిలీజ్‌లో అద్భుత కలెక్షన్లను అందుకుంటోంది. ఫిబ్రవరి 1వ తేదీన మలయాళం సహా తమిళంలో మరోసారి థియేటర్లలో విడుదలైంది. రెండు చోట్ల చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రెండు కోట్లకుపైగా వసూళ్లను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తమిళం, మలయాళంలో రీ రిలీజ్ అయిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా ప్రేమమ్ నిలవనుంది.
అయితే ప్రేమమ్ చిత్రం థియేటర్లలో రీరిలీజ్ కావడం ఇదేం తొలిసారి కాదు. మొత్తంగా మూడోసారి. 2016లో వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ సారి, అలాగే 2017లోనూ మరోసారి, ఇప్పుడు దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి రీరిలీజ్ అయింది. మూడుసార్లు ఈ చిత్రానికి మంచి క్రేజ్ దక్కింది.