Sai Dharam Tej New Name :మెగాహీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా తన పేరు మార్చుకున్నారు. తన తల్లి దుర్గ పేరును తీసుకుని ఆయన సాయి దుర్గ తేజ్‌గా మారిపోయారు. ఇలా ఆమె ఎప్పుడూ తనతో ఉన్నట్లుంటుందని అలా చేసినట్లు పేర్కొన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా నిర్వహించిన 'సత్య' ప్రెస్మీట్లో తేజ్ ఈ ఆసక్తికరవిషయాలను పంచుకున్నారు.
ఇవాల నుంచి నా పేరులో మా అమ్మ పేరును యాడ్ చేసుకున్నాను. ఇంటి పేరు కింద మా నాన్న పేరు ఎలాగో ఉంటుంది. మా అమ్మ కూడా నాతోనే ఉండాలి. అందుకే మా అమ్మ పేరును నా పేరులో కలుపుకున్నాను. 'సాయి దుర్గ తేజ్' గా మార్చుకున్నాను" అంటూ తేజు తెలియజేశారు.
అంతే కాకుండా నిర్మాణ సంస్థను నెలకొల్పాలన్న కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందంటూ, దానికి విజయ దుర్గ ప్రొడక్షన్స్ అనే పేరు పెట్టానన్నాంటూ ఇదే వేదికగా వెల్లడించారు. ఇది విన్న ఫ్యాన్స ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'తల్లి కోసం పేరు మార్చుకున్నారు. మీరు గ్రేట్' అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ గతంలోనూ తన స్క్రీన్ నేమ్‌ను 'సాయి తేజ్'గా మార్చుకున్నారు. అయినప్పటికీ ఫ్యాన్స్ ఆయన్ను అసలు పేరుతోనే పిలుస్తుంటారు.