తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలోకి మరో అందమైన ప్రేమ కథ - డోంట్ మిస్​! - అశోక్ సెల్వన్ సబా నాయగన్

Saba Nayagan OTT Release Date : Saba Nayagan OTT Release Date: ఓటీటీలోకి ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ మూవీ విడుదల కానుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మీరు చూడాలనుకుంటే ముందుగా ఈ స్టోరీ చదివేయండి.

OTTలోకి మరో అందమైన ప్రేమ కథ - డోంట్ మిస్​!
OTTలోకి మరో అందమైన ప్రేమ కథ - డోంట్ మిస్​!

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 8:53 PM IST

Saba Nayagan OTT Release Date : ప్రేక్షకులను అలరించేందుకు ప్రతి వారం ఓటీటీలోకి సరి కొత్త సినిమాలు, వెబ్​సిరీస్​లు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఎన్నో రకాల జానర్​ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే కొద్ది రోజుల్లో రానున్న ప్రేమికుల దినోత్సవం(వాలంటైన్స్ డే) సందర్భంగా సరికొత్త సూపర్ హిట్ రొమాంటిక్​ డ్రామాను ఓటీటీలో రిలీజ్​ చేయబోతున్నారు మేకర్స్​.

వివరాల్లోకి వెళితే. 'భద్రమ్', 'మన్మధ లీల', 'పోర్ తొళిల్', 'పిజ్జా 2' సినిమాల ఫేమ్​ యంగ్​ హీరో అశోక్ సెల్వన్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం 'సబా నాయగన్'(Ashok Selvan Saba Nayagan). గతేడాది డిసెంబర్​ విడుదలైన ఈ చిత్రం మంచి హిట్​ను అందుకుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో మేఘా ఆకాష్, కార్తీక మురళీధరన్​తో పాటు కలర్ ఫొటో ఫేమ్​ చాందినీ చౌదరి హీరోయిన్స్​గా నటించారు. సినిమాలో మైల్ సామి, మైఖేల్ తంగదురై, అరుణ్ కుమార్, జైశీలన్ శివరామ్, ఉడమలై రవి, ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే ఇప్పుడీ చిత్రాన్ని ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. ఇకపోతే ఈ చిత్రానికి సీఎస్ కార్తికేయ దర్శకత్వం వహించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించారు. క్లియర్ వాటర్ ఫిల్మ్స్, మెగా ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా కలిసి సినిమాను నిర్మించాయి.

Saba Nayagan Story కథేంటంటే ? సబా నాయగన్ న్యూ ఏజ్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. మూడు దశల్లో ముగ్గురు యువతులతో హీరో సాగించిన ప్రేమాయణమే ఈ కథ. సినిమా సబా (అశోక్ సెల్వన్) బాగా తాగి పబ్లిక్‌లో న్యూసెన్స్ చేసి జైలుకెళ్తాడు. అక్కడ హార్ట్ బ్రేక్​ అయిన మరో ఖైదీతో అతడు చెప్పే ప్రేమ కథలే ఈ చిత్రం. రొమాంటిక్ డ్రామా, లవ్ స్టోరీస్​ మూవీస్​ ఎక్కువ చూసేవారికి ఈ చిత్రం మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

'పుష్ప'గాడే కింగ్​ - ఈ భారీ సినిమాల ఓవర్సీస్​ రైట్స్​ ఎన్ని కోట్లంటే?

ఆ హీరోయిన్​ నన్ను కొట్టింది - 30 గాయాలతో హాస్పిటల్​లో చేరా! : శ్రద్ధా దాస్​

ABOUT THE AUTHOR

...view details