తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 3:19 PM IST

ETV Bharat / entertainment

ఈ భామపైనే టాలీవుడ్ ఫోకస్- నెక్ట్స్ రష్మిక, శ్రీలీలలా అవుతుందా?

ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్లు, హీరోల చూపంతా ఓ ముద్దుగుమ్మవైపే మళ్లుతోంది! రీసెంట్​గా వచ్చిన సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ వరుస ఆఫర్లు దక్కించుకుంటోందట. దీంతో ఈమె నెక్ట్స్​ రష్మిక, శ్రీలీలలా అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటే?

Rukmini Vasanth Upcoming Movies
Rukmini Vasanth Upcoming Movies

Rukmini Vasanth Upcoming Movies:కన్నడ భామలైన రష్మిక మందన్నా, శ్రీలీల సౌత్​లో ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలోకి మరో కన్నడ భామ రాబోతోంది. తెలుగు, తమిళ చిత్ర సీమల్లో మెల్లమెల్లగా అవకాశాలు అందుకోబోతోంది. ఆమె ఎవరో కాదు రుక్మిణి వసంత్. ఆమె ఇండస్ట్ట్రీలో రష్మిక, శ్రీలీలకు గట్టిపోటినిచ్చేందుకు సై అంటోంది.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రుక్మిణి వసంత్ ట్రెండింగ్​లో ఉంటోంది. 'సప్తసాగరాలు దాటి' అనే మూవీతో రుక్మిణి వసంత్ చాలా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఎమోషనల్ పాత్రలో అందర్నీ ఆకర్షించింది. తెలుగులో కూడా ఈ సినిమా డబ్ చేశారు. రుక్మిణీ అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సైడ్ ఏ , సైడ్ బి అంటూ రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాకు తెలుగులో మిశ్రమ స్పందన లభించినా, రుక్మిణి యాక్టింగ్, లుక్స్​కు మంచి మార్కులే పడ్డాయి.

ఈ మూవీ తర్వాత టాలీవుడ్ లో రుక్మిణి పేరు మరింత పాపులర్ అయ్యింది. సినిమా ఛాన్సులు క్యూ కట్టాయి. ఆ మధ్య విజయ్ దేవరకొండ లేటెస్ట్​ మూవీ కోసం ఈ ముద్దుగుమ్మ పేరును పరిశీలించారట. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సినిమా విషయంలో కూడా రుక్మిణి వసంత్ పేరు వినిపించింది. ఓ వైపు తెలుగులో ఇలా రుక్మిణి పేరు పాపులర్ అవుతుండగానే మరోవైపు కోలీవుడ్ నుంచి ఆమెకు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. స్టార్ డైరెక్షర్ మురుగుదాస్- శివకార్తికేయన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో రుక్మిణి వసంత్ ఛాన్స్​ పట్టేసింది.

ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్​గా షురూ అయ్యింది. త్వరలోనే రుక్మిణి తన తెలుగు సినిమాను కూడా ప్రకటించనుందట. తమిళం, తెలుగు భాషల నుంచి దర్శక నిర్మాతలు రుక్మిణిని సంప్రదిస్తున్నట్లు టాక్. దీంతో ఈ అమ్మడు కూడా రష్మిక, శ్రీలీల రేంజ్ పాపులర్ అవుతుందన్న డిస్కషన్ ఇప్పటికే మొదలైంది. ఎందుకంటే అప్పుడు రష్మిక, ఇప్పుడు రుక్మిణి ఇద్దరూ రక్షిత్ శెట్టి మూవీతోనే తెలుగులో పాపులర్ అయ్యారు. మరి రష్మికలా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి స్టార్ హీరోయిన్ గా మెరుస్తుందో లేదో చూడాలి.

అందాల భామల చీట్ మీల్- వీళ్ల ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే?

షాకింగ్ : చావు నుంచి తప్పించుకున్న రష్మిక - వామ్మో ఏం జరిగిందంటే?

ABOUT THE AUTHOR

...view details