ETV Bharat / state

రాబోయే రోజుల్లో బలహీనమైన తల్లి, అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండొద్దు : మంత్రి పొన్నం - Poshana Aarogya Jatara Program - POSHANA AAROGYA JATARA PROGRAM

Nutrition Health Fair in Karimnagar : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బలహీనమైన తల్లి, అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆహార అలవాట్ల పట్ల ప్రతి మహిళకు అవగాహన కల్పించాలని అంగన్ వాడీ సిబ్బందికి, అధికారులకు మంత్రి సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోషణ ఆరోగ్య జాతరకు మంత్రులు సీతక్క, పొన్న ప్రభాకర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

Nutrition Health Fair in Karimnagar
Minister Ponnam Attend in Poshana Aarogya Jatara Program (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 1:47 PM IST

Updated : Sep 30, 2024, 3:15 PM IST

Minister Ponnam Attend in Poshana Aarogya Jatara Program : పిల్లలు, తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం ప్రారంభించిందని, ఆ వేడుక ఇవాళ కరీంనగర్​లో జరుపుకోవటం తనకెంతో సంతోషంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్​ పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది గర్భిణీలు, చిన్నపిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు. గ్రామాల్లో ప్రతివారం పోషణ ఆరోగ్య జాతర నిర్వహించి అందరికి అవగాహన కల్పించాలన్నారు.

గర్భిణీగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రక్తహీనత ఇతర లోపాలు వస్తున్నాయని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సీతక్క మంత్రిగా రాష్ట్రంలో రక్తహీనత ఎవరికి ఉండకూడదని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించిన పొన్నం, ప్రభుత్వమే కాదు ప్రజలు సహకరించాలని కోరారు. మనం పాలను ఉత్పత్తి చేస్తున్నాం కానీ, మనం వాడుకోకుండా బయట నుంచి తెచ్చుకుంటున్నామని తెలిపారు. హుస్నాబాద్​లో ప్రతి ఇంటా పాల ఉత్పత్తి జరుగుతుందన్న మంత్రి, అవసరం ఉన్నన్ని వాడుకొని డైరీకి ఇస్తారని తెలిపారు.

Nutrition Health Fair in Karimnagar : గ్రామీణపరంగా అంగన్​వాడీ, ఏఎన్ఎం ఆశా కార్యాకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బలమైన బిడ్డలను ఈ తెలంగాణకు అందించాలని కోరారు. మంత్రి సీతక్క రాత్రి పగలు తేడా లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారన్న పొన్నం, అధికారులు తమ డ్యూటీ అయిపోయిందా, అని చెప్పినమా కాకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని సూచించారు.

"రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బలహీనమైన తల్లి, అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండొద్దు. వాళ్లందరికీ ఆరోగ్యపరంగా అవగాహన కల్పించాలి. అన్ని జాగ్రత్తలు తీసుకొని బలమైన బిడ్డ ఈ తెలంగాణకు నూతనంగా జన్మనివ్వాలి. ముఖ్యమంత్రి ఆలోచనకు మంత్రి సీతక్క ఆచరణకు ఇక్కడ ఉన్న తల్లులంతా ఇది పాటించాలని కోరుకుంటున్నాను."-పొన్నం ప్రభాకర్​, మంత్రి

ప్రస్తుతం చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు : రేపటి భవిష్యత్ కోసం బలమైన బాలల వ్యవస్థను తయారు చేసి రాష్ట్రానికి అందించాలని మంత్రి సీతక్క కోరారు. పల్లెలకు మళ్లీ పాత రోజులు రావాలన్న మంత్రి, ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలని ఆశించారు. ఉపాధ్యాయులు సైతం పోషకాహారంపై అవగాహన కల్పించాలని, వాళ్లు చెప్తేనే విద్యార్థులు రిసీవ్ చేసుకుంటారన్నారు. ఇది ఒక ఉద్యమంలా ప్రతి పల్లెకు పోషణ ఆహార జాతర కార్యక్రమం తీసుకుపోవాలన్నారు. ప్రతి ఒక్కరి రక్తంలో 12 శాతం హిమోగ్లోబిన్ ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు పిల్లలకు, గర్భిణీలకు మంచి పోషకాహారాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపారు.

ఆహార భద్రతలో తెలంగాణకు 23వ స్థానం - బయట ఫుడ్​ తినేటప్పుడు కాస్త చూసుకోండి గురూ - SFSI 2024 Telangana Rank

రోగనిరోధక శక్తిని పెంచే 'బ్లాక్‌ ఫుడ్స్​'- వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు - Health Benefits of Black Foods

Last Updated : Sep 30, 2024, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.