Pollution Control Board Programs in Telangana : కాలుష్య ఉద్గారాలను, పరిశ్రమల వ్యర్థాలను జలశయాల్లో కానీ ఇళ్లసమీపాన ఎవరైనా పారేస్తుంటే వెంటనే కాలుష్య నియంత్రణ మండలి నైట్ పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. ఉల్లంఘనులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టిస్తే పీసీబీ రూ.10వేల పారితోషికం ఇస్తుంది. దశాబద కాలం నుంచి ఈ కార్యక్రమం అమలవుతున్నా పౌరుల్లో కనీసం దీని గురించి అవగాహన లేదు.
అవగాహన కార్యక్రమాలు నిర్వహించక : అధికారులూ ప్రచారం చేయలేదు. కాలుష్య నియంత్రణకు, ప్రధానంగా పరిశ్రమల వ్యర్థాలను జలశయాల్లో డంపింగ్ చేయడాన్ని అడ్డుకునేందుకు పీసీబీ ఈ కార్యక్రమానికి తెరలేపింది. కానీ అది రానురాను మరుగునపడింది.
పీసీబీ కేంద్ర కార్యాలయం, హైదరాబాద్, ఆర్సీపురం జోన్ కార్యాలయాల పరిధిలో మూడు నైట్ పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతుంటాయి. ఒక్కో వాహనంలో ఒక అనలిస్ట్, ఏఈ, ఈఈ స్థాయి అధికాలుల, సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఘాటు వాసనలు వచ్చినా, డంపింగ్ చేస్తున్నట్లు సమాచారం అందినా వెంటనే వీరంతా ఆ ప్రాంతానికి చేరుకుంటారు. జీడిమెట్ల, బాలానగర్, కాటేదాన్, మల్లాపూర్, బొల్లారం పారిశ్రామిక ప్రాంతాలను నైట్ పెట్రోలింగ్ బృందం నిఘా ఉంటుంది. అధికారులు ఇచ్చే నివేదికపై పీసీబీ మెంబర్ సెక్రటరీ స్థాయిలో ఎప్పుడూ సమీక్ష జరుగుతూనే ఉంటుంది.
సమాచారం అందిస్తే పారితోషికం : కాలుష్య నియంత్రణ మండలి నైట్ పెట్రోలింగ్‌ను 98667 76755, 98667 76718 నెంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను సీక్రెట్‌గా ఉంచుతారు. ఘాటు వాసనలు వెలువడినా, వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నట్లు గమనించినా, ఫొటోలు తీసి ఆధారాలను ఇస్తే సమస్య పరిష్కారంతో పాటు పారితోషికం వస్తుంది.
ఎవరూ చూడట్లేదని రోడ్లపై చెత్త పడేస్తున్నారా? - ఐతే అంతే సంగతులు - GARBAGE THROWING ON ROADS IN HYD