Rahul Gandhi Comments On PM Modi : ప్రజలను గౌరవించడం ఎంత అవసరమో వారి జేబుల్లోకి డబ్బులు రావడం కూడా అంతే ముఖ్యం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారు. ప్రధాని నరేంద్రీ మోదీ ప్రజలను 24 గంటలు గౌరవించినా, ప్రజల జేబుల్లో డబ్బులు లేక చనిపోయే పరిస్థితి ఎదురవుతుందన్నారు. గౌరవం ఎంత ముఖ్యమో, పిల్లలకు చదువు చెప్పించడానికి ప్రజల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు ఉండటం కూడా అంతే ముఖ్యం అని చెప్పారు. హరియాణాలో జరిగిన ఎన్నికల సభలో ప్రజలనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు.
"ఈ మధ్య కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, కుమారి సెల్జా, భూపిందర్ హూడా ప్రసంగాల్లో గౌరవం గురించి మాట్లాడుతుండటం నేను విన్నా. అయితే ప్రజల పట్ల గౌరవం ఉండాలి, అది ముఖ్యం. అంతే ముఖ్యంగా ప్రజల జేబుల్లోంచి ఎంతో లాగేసుకుంటున్నారో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం." అని రాహుల్ గాంధీ అన్నారు.
'ప్రధానికి 5నిమిషాల టైం దొరకలేదు'
రెజ్లర్లు రోడ్డు మీద కుర్చుండేలా చేశారని (బీజేపీని ఉద్దేశించి) ప్రియాంక గాంధీ అన్నారు. వారిని కలవడానికి ప్రధానికి కేవలం 5 నిమిషాల సమయం కూడా దొరకడం లేదని మండిపడ్డారు. అంబాలాలో జరిగిన ఎన్నికల సభలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. "ఇటీవల ఒలింపిక్స్‌లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మీకు ఆత్మగౌరవం ఉంది. దీనిపై పోరాడాల్సింది మీరే. మీరు ద్రవ్యోల్బణంపై పోరాడుతున్నారు. అయినా ప్రభుత్వం మీ గురించి ఏం చేయడం లేదు. మీరు ఆత్మగౌరవంతో జీవించాలని, న్యాయం కావాలని అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని (అధికారం నుంచి) విరిసిపారేయండి." అని ప్రియాంక ధ్వజమెత్తారు.
#WATCH | Haryana: Addressing a public rally in Ambala, Congress leader Priyanka Gandhi Vadra says, " what was done to our wrestlers? they were made to sit on the road, they kept protesting. the prime minister did not have even 5 minutes to meet them. and then you all saw what… pic.twitter.com/dqc2jZbBdD
— ANI (@ANI) September 30, 2024
హామీల వర్షం
ప్రచారంలో భాగంగా తమ మేనిఫెస్టో పొందుపర్చిన హామీల మరోసారి గురించి ప్రజలకు వివరించారు రాహుల్ గాంధీ. మహిళా శక్తి యోజన కింద మహిళల బ్యాంకు అకౌంట్లలో ప్రతి నెల రూ.2000, ఒంటరి మహిళలకు రూ.6000 చొప్పున వేస్తామని చెప్పారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు సామాజిక భద్రత కోసం పాతి పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.