ETV Bharat / entertainment

బాలయ్య NBK 109 కోసం రాజస్థాన్‌ ఎడారి సెట్‌ - షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే? - NBK 109 Movie Rajasthan Set - NBK 109 MOVIE RAJASTHAN SET

Balakrishna NBK 109 Movie Rajasthan Set : రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతమైన ఓ పల్లెటూరును తలపించేలా సెట్​ను తీర్చిదిద్దింది ఎన్​బీకే 109 టీమ్. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Balakrishna NBK 109 Movie Rajasthan Set (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2024, 8:25 AM IST

Updated : Sep 30, 2024, 8:50 AM IST

Balakrishna NBK 109 Movie Rajasthan Set : టాలీవుడ్​ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చూపిస్తున్న జోరు తెలిసిందే. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో వరుస విజయాలను అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడాయన NBK 109 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్లడ్‌ బాత్‌కు బ్రాండ్‌ నేమ్‌, వయలెన్స్‌కు విజిటింగ్‌ కార్డ్‌ ఈ సినిమా క్యాప్షన్. భగవంత్‌ కేసరి వంటి భారీ హిట్ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న చిత్రమిది.

NBK 109 Movie Shooting Update : పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రంలోని ఓ కీలక సీక్వెన్స్​ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ భారీ సెట్ ఆకట్టుకుంటోంది. ఎడారి ప్రాంతం, రాజస్థాన్‌లోని పల్లెటూరును తలపించేలా ఈ సినిమా సెట్​ను రూపొందించారు. దీన్ని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో వేశారు. దండుమల్కాపురంలోని పారిశ్రామిక పార్కు పక్కనే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని దీన్ని వేశారు.

వాస్తవానికి ఈ సినిమా సెట్​ను ఇరవై రోజుల క్రితమే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఐదు రోజుల పాటు సినిమాను చిత్రీకరించారు. కాగా, ఈ చిత్రాన్ని దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హీరో, హీరోయిన్‌లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. అక్టోబరు మొదటి వారంలో షూటింగ్‌ పునఃప్రారంభం కానుంది.

NBK 109 Movie Cast and Crew : సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ బ్యానర్​పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ స్టార్ బాబీ దేఓల్ విలన్​గా నటిస్తున్నారు. అలానే సినిమాలోని కీలక పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ కనిపించనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. తమన్నాతో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్నట్లు ప్రచారం సాగింది. అయితే, ఈ వార్తలపై టీమ్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం విజయ్‌ కార్తీక్‌ చూసుకుంటున్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య కామెంట్స్ - వారసుడు ఎప్పుడు రానున్నారంటే? - Balakrishna About Mokshagna Entry

ఆ పాత్ర కోసం ఆయన భార్యను కలిశాను : 'అమరన్‌' సాయి పల్లవి - Amaran Saipallavi

Last Updated : Sep 30, 2024, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.