తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కాంతార' మూవీ టీమ్ బస్సు బోల్తా - 20 మందికి గాయాలు - KANTARA BUS ROAD ACCIDENT

'కాంతార' మూవీ టీమ్​కు సంబంధించిన ఆర్టిస్టుల బస్సుకు రోడ్డు ప్రమాదం - ఇప్పుడు ఆర్టిస్టుల పరిస్థితి ఎలా ఉందంటే?

Kantara Movie Team Bus Road Accident
Kantara Movie Team Bus Road Accident (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 1:29 PM IST

Kantara Movie Team Bus Road Accident : కన్నడ డైరెక్టర్ కమ్ హీరో రిషభ్​ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన 'కాంతార' సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. సినిమా విశేష ప్రేక్షకదరణతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకుంది. అయితే ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్​ రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కాంతార చాప్టర్ 1కు చెందిన ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది. ​షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ బస్సు బోల్తా పడింది.

ఎక్కడ జరిగిందంటే? - ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోస్తాలోని ప్రత్యేకమైన ప్రాంతాల్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్​ను పూర్తి చేసుకుంది. అయితే ఈ టీమ్ మొత్తం ముదూరులో డ్యాన్స్​ షూట్​ పూర్తి చేసుకుని కొల్లూరులోని తమ హాస్టల్​కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిసింది. కొల్లూరు వైపు వెళ్తుండగా అనెజరీ దగ్గర ఆర్టిస్టుల మినీ బస్సు బోల్తా పడింది. ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోతుంటే, బండి కంట్రోల్ తప్పి బస్సు బోల్తా పడినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్నారని సమాచారం. అయితే వారందరికీ స్వల్ప గాయాలు తగిలాయని తెలుస్తోంది. ప్రస్తుతం వీరంతా క్షేమంగానే ఉన్నారని, జడ్కల్​ మహాలక్ష్మీ క్లినిక్​లో ఫస్ట్ ఎయిడ్ అందించారని తెలిసింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కుందాపుర్​ హాస్పిటల్​కు తరలించారట.

ఫోన్ నొక్కుతూ బస్సు నడిపిన డ్రైవర్ - డ్రైవర్​ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఫోన్ నొక్కుతూ బస్సు నడిపాడని, అందుకే ప్రమాదం జరిగిందని, బస్సులో ఉన్న ఓ జూనియర్ ఆర్టిస్ట్​ ఆరోపించాడు. ఘటన జరగగానే డ్రైవర్​ను కొట్టినట్లు కూడా తెలిసింది. సమాచారం అందుకున్న టూరిస్ట్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొందని సమాచారం అందింది. అలానే పోలీసులు కూడా ప్రమాద స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

ఈ వారమే OTTలోకి భారీ బ్లాక్ ​బస్టర్​ సినిమా - ఇంకా థియేటర్లలో రానున్న చిత్రాలేంటంటే?

'ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా?' - రష్మిక సమాధానానికి దద్దరిల్లిన ఆడిటోరియం!

ABOUT THE AUTHOR

...view details