Richest TV Actor In India:కపిల్ శర్మ బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ కామెడియన్లలో ఒకరు. ఈయన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీ విత్ నైట్స్ విత్ కపిల్ శర్మ స్టార్ కమెడియన్‌గా మారాడు. బీ టౌన్లో ఏ స్టార్ హీరో సినిమా విడుదలైనా కపిల్ షోకి వచ్చి ప్రమోట్ చేసుకుంటారంటే ఆయన ఏ రేంజ్లో సక్సెస్ అయ్యారో ఇట్టే అర్థమవుతుంది. అయితే కపిల్ శర్మ ఆస్తుల గురించి తెలుస్తే మీరు షాక్ అవుతారు. బాలీవుడ్ బడా హీరోలను మించిన ఆస్తులు ఆయన సొంతం.
ప్రస్తుతం భారత్‌లో ఏ భాషలోనైనా టీవీ షోలకు అత్యంత ఆదరణ లభిస్తోంది. అత్యంత జనాదరణ పొందిన భారతీయ టీవీ షోలలో ఒకటైన తారక్ మెహతా కా ఊల్తా చష్మా ముఖ్యాంశాలుగా ఉన్న దిలీప్ జోషి ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 1.5 లక్షలు సంపాదిస్తారు. ఓ జాతీయ సంస్థ నివేదిక ప్రకారం అతడి నెట్‌వర్త్ రూ.43 కోట్లు. ఇక మరో టీవీ నటుడు కరణ్ కుంద్రా నెట్‌వర్త్ రూ.91 కోట్లుగా ఉంది. అయితే ఈ ఇద్దరూ అత్యంత ధనిక టీవీ నటులు కాదు. కపిల్ శర్మ భారత్‌లో అత్యంత రిచెస్ట్ టెలివిజన్ ఆర్టిస్ట్ అని మీకు తెలుసా?
కపిల్ శర్మ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనిక టీవీ ఆర్టిస్ట్. అతడు 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ '(2007) తో ఫేమస్ అయ్యాడు. అప్పటి నుండి హాస్యనటుడిగా, హోస్ట్‌గా రాణిస్తున్నాడు. అంతే కాదు, 'కిస్ కిస్కో ప్యార్ కరూన్' , 'ఫిరంగి', 'జ్విగాటో' వంటి సినిమాల్లో కూడా నటించాడు. 2013లో కపిల్ శర్మ తన సొంత నిర్మాణ సంస్థ K9 ప్రొడక్షన్స్న్తోపాటు 'కపిల్ కామెడీ నైట్స్' నిర్మించాడు .కపిల్ శర్మ ప్రతి ఎపిసోడ్‌కు దాదాపు రూ.50 లక్షలు సంపాదిస్తాడు. కొన్నేళ్లుగా చిత్రసిమలో హాస్యనటుడిగా, నటుడిగా, హోస్ట్‌గా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న కపిల్ శర్మ దాదాపు రూ.300 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నాడు.