Raviteja Discharged : గాయం కారణంగా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టాలీవుడ్నటుడు రవితేజ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అభిమానులను తెలియజేసేందుకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు.
"ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా క్షేమాన్ని ఆకాంక్షిస్తూ మెసేజ్‌లు పంపిన వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే నేను మళ్లీ షూటింగ్‌లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చూసి ఫ్యాన్స్ 'గెట్ వెల్ సూన్ అన్న' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఏమైందంటే?
హీరో రవితేజ ప్రస్తుతం '#RT75' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరక్కెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమా చిత్రీకరణలో భాగంగానే గురువారం షూట్ జరుగుతున్న సమంలో రవితేజకు గాయమైంది. ఇక రవితేజ గాయపడిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
ఇక '#RT 75' విషయానికి వస్తే, ఇందులో రవితేజ సరసన శ్రీలీల నటిస్తుండగా, ఈ మూవీతోనే రచయిత భాను భోగవరపు డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సినీ వర్గాల మాట.