తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విజయ్​, రష్మిక లవ్ స్టోరీ! ఇద్దరి తలపై ఒకే క్యాప్​- ఇప్పుడిదే నెట్టింట ట్రెండింగ్!

Rashmika Vijay Pink Cap : రౌడీ బాయ్​ విజయ్​ దేవరకొండ- హీరోయిన్​ రష్మిక మందన్న మధ్య ఏదో నడుస్తోంది అనే గాసిప్స్​కు మరింత బలాన్ని ఇచ్చే పోస్ట్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్​ అవుతోంది. ఇద్దరు ఒకే రకం క్యాప్​ ధరించి ఉన్న ఫొటోను, వీడియోను కొందరు నెటిజన్స్​ హైలైట్​ చేస్తున్నారు.

Rashmika Vijay Pink Cap
Rashmika Vijay Pink Cap

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 7:53 PM IST

Rashmika Vijay Pink Cap :టాలీవుడ్​ సిల్వర్​ స్క్రీన్​పై మోస్ట్​ బెస్ట్​ కపుల్​గా పేరున్న వారిలో విజయ్​-రష్మిక జంట ఒకరు. 2018లో వచ్చిన 'గీతా గోవిందం' సినిమాలో వీరిద్దరి నటన, కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో లవ్​ట్రాక్​ నడుస్తుందన్న వార్తలు జోరందుకున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన తొలి సినిమా కూడా ఇదే కావడం, అప్పుడప్పుడు వీరు విడివిడిగా ఎక్కడికి వెళ్లినా దానికి సంబంధించిన కామన్​ ఫొటోలను తమ ఇన్​స్టాగ్రామ్​ హ్యాండిల్​లో పోస్ట్ చేయడం వీరి ప్రేమకథకు మరింత బలాన్ని చేకూర్చేవి.

'ఎన్ని గాసిప్స్​ వచ్చినా జానతా నహీ'
అయితే అలా వీరు పోస్ట్​ చేసిన వాటిల్లో ఏదో ఒక కామన్​ పాయింట్​ను ట్రిగ్గర్​ చేస్తూ దానిని తెగ వైరల్​ చేసేస్తారు నెటిజెన్స్​. అలా ఇప్పటివరకు చాలానే పోస్టులు పెట్టారు. ఇందులో ఒకటి కొద్దిరోజుల క్రితం వీరు గోవాకు విడివిడిగా వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను తమ తమ సోషల్​ మీడియా అకౌంట్​లలో షేర్​ చేశారు. అలా వీరు పంచుకున్న ఫొటోల్లో కామన్​ థింగ్​ను పసిగట్టి వీరి మధ్య ఏదో ప్రేమ వ్యవహారం నడుస్తుంది చూడండి అంటూ వార్తలు వచ్చేవి. అంతేకాకుండా ఒక సందర్భంలో ఇద్దరూ ఒకే తరహా షర్ట్​ను వేసుకొని వార్తల్లో నిలిచారు. దీనినీ హైలైట్​ చేశారు కొందరు. ఇలా ఎన్ని రకాల గాసిప్స్​ వచ్చినా అటు విజయ్​ ఇటు రష్మిక వీటిపై ఇప్పటివరకు పెద్దగా స్పందించలేదు. తమ సినిమాలు తాము చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.

బేబీ పింక్​ క్యాప్​లో విజయ్​-రష్మికా జోడీ
ఇదిలాఉంటే కొద్దిరోజుల కిందట​ విజయ్​ దేవరకొండ తన బ్రాండ్​ రౌడీ వేర్​ను ప్రమోట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. దీనిని తన ఇన్​స్టాలో పంచుకున్నారు కూడా. అందులో అతను ఒక బేబీ పింక్​ కలర్​లో ఉండే క్యాప్​ను పెట్టుకొని కనిపించారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా రష్మిక ఈనెల 8న ఇన్​స్టాలో ఓ పోస్ట్​ పెట్టారు. ఇందులో మహిళలకు ఉమెన్స్​ డే విషెస్​ తెలుపుతూ ఓ ఫొటోను షేర్​ చేశారు. ఈ ఫొటోలో తానూ అంతకుముందు విజయ్​ పెట్టుకొని కనిపించిన పింక్​ క్యాప్​నే ధరించి కనిపించారు. దీంతో ఇద్దరు సేమ్​ టు సేమ్​ క్యాప్​ పెట్టుకున్నారేంటబ్బా అన్న చర్చ మొదలైంది. దీంతో వీరి లవ్​ట్రాక్​ అంశం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం ఈ పోస్ట్​ నెట్టింట తెగ వైరల్​ అవుతోంది.

ఇక వీరిద్దరి కలయికలో 'గీతా గోవిందం' తర్వాత 'డియర్​ కామ్రేడ్​' సినిమా వచ్చినా అది కమర్షియల్​గా పెద్దగా హిట్​ కాలేదు. అయినప్పటికీ ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. దీంతో వీరి ఫ్యాన్​ ఫాలోయింగ్​ మరింత పెరిగిపోయింది. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే విజయ్​ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్​ సినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరి​ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. రష్మిక పుష్ప-2తోపాటు పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో విషాదం- డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత

రీల్ కపుల్ టు రియల్ కపుల్- కిరణ్ అబ్బవరం ఎంగేజ్​మెంట్ డేట్​ ఫిక్స్!

ABOUT THE AUTHOR

...view details