తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సల్మాన్​ భాయ్​తో రష్మిక - మరో భారీ ప్రాజెక్ట్ ఛాన్స్​ కొట్టేసిన నేషనల్ క్రష్​ - Rashmika Salman khan - RASHMIKA SALMAN KHAN

Rashmika Mandanna Salman Khan Movie : నేషనల్ క్రష్ బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్​ మూవీలో హీరోయిన్​గా నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చింది.

ETV bharat
Rashmika Mandanna (ETV bharat)

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 12:04 PM IST

Rashmika Mandanna Salman Khan Movie :నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడిప్పుడే బాలీవుడ్​లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటుంది. గతంలో పుష్పతో బాలీవుడ్​కు పరిచయమైన రష్మిక ఆ తర్వాత మిస్టర్​ మజ్ను, గుడ్​బై సినిమాలతో డెరెక్ట్​గా బీటౌన్​లో అడుగుపెట్టింది. కానీ ఈ చిత్రాలు అంతగా ఆడలేదు. అనంతరం ఈ ముద్దుగుమ్మ యానిమాల్ లాంటి సూపర్ హిట్​తో అక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇందులో గీతాంజలిగా రణ్ బీర్ కపూర్​తో పోటీపడి మరీ నటించి ఆడియెన్స్​ను మెప్పించింది. ఇక ఇప్పుడు టాప్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సికందర్ మూవీలో హీరోయిన్​గా ఛాన్స్ కొట్టేసింది. ఆ విషయాన్ని స్వయంగా రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకుంది.

ఈ అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రం రష్మికకు 25వ సినిమా. దీంతో బాలీవుడ్​కు వెళ్లిన కొద్ది కాలంలోనే సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరో సరసన నటించే అవకాశం రావడం రష్మిక కెరీర్​కు బాగా ఉపయోగపడుతుందని ఫ్యాన్స్​ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ చిత్రంలో ఎటువంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది చూడాలి. మొదట ఈ పాత్రకు కియారా అడ్వాణీని తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రష్మికను ఈ ప్రాజెక్టులో తీసుకుంటునట్లు సికందర్ మూవీ టీం కూడా అధికారికంగా ప్రకటించేసింది. ఇంకా హిందీలో మరో సినిమా కూడా చేస్తోంది రష్మిక. చావా అనే హిస్టారికల్ డ్రామాలో విక్కీ కౌశల్ సరసన నటిస్తోంది.

Rashmika Upcoming Movies : ప్రస్తుతం తెలుగులో రష్మిక పాన్ ఇండియా ఫిల్మ్ అయిన పుష్ప ది రూల్(Puhspa 2 Movie) సినిమాలోనూ నటిస్తోంది. మొదటిభాగంలో ఒక మధ్య తరగతి అమ్మాయిగా కనిపించిన శ్రీవల్లి రెండో భాగంలో డబ్బున్న మహిళగా కనిపించనుందని ఆ మూవీ పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది. దీంతో పాటే ధనుశ్​ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరాలో కూడా హీరోయిన్​గా నటిస్తోంది రష్మిక.

తండ్రి అడిగిన ఆ ఒక్క ప్రశ్న - రౌడీహీరోను సినిమాల్లోకి వెళ్లేలా చేసిందట! - Happy Birthday Vijay Devarkonda

బుజ్జితల్లి ఫ్యాన్స్‌కు 'తండేల్' టీమ్ సర్​ప్రైజ్​ వీడియో - Happy Birthday Sai pallavi

ABOUT THE AUTHOR

...view details