తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఏసుబాయి'గా రష్మిక, 'రుక్మిణీ దేవి'గా రీతూ వర్మ​ - అందాల మహారాణులు విచ్చేస్తున్నారహో! - Actress in Historical Period films - ACTRESS IN HISTORICAL PERIOD FILMS

Actress in Historical Period Films : ప్రస్తుతం పలువురు స్టార్ హీరోయిన్లు చారిత్రక కథల్లో భాగమవుతున్నారు. చరిత్ర పుటలు తిరగేస్తూ, అందాల రాణుల్లా కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి వారెవరు? ఏ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు? వంటి వివరాలను తెలుసుకుందాం.

source ETV Bharat
Rashmika Ritu Varma (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 6:59 AM IST

Updated : Sep 7, 2024, 9:36 AM IST

Actress in Historical Period Films : ఒకప్పుడు హీరోయిన్స్​ అనగానే అందాలను ఆరబోయడం, సాంగ్స్​లో ఆడిపాడటం మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడంతా వారు తమ స్టార్‌డమ్‌తో సినీ ప్రియుల్ని థియేటర్లకు రప్పించి, బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో హొయలొలికిస్తూ, అల్లరి పాత్రలతో గిలిగింతలు పెట్టిస్తూనే మరోవైపు లేడీ ఒరియెంటెడ్​ చిత్రాలతోనూ దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో పలువురు హీరోల సినిమాల్లోనూ అందాల రాణుల్లా రాజసం ఒలికిస్తూ, వీరనారుల్లా సాహసాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారెవరంటే?

Rashmika Chava Movie : రష్మిక ఓ వైపు గ్లామర్‌ పాత్రలు చేస్తూనే మరోవైపు నటనా ప్రాధాన్యమున్న కథలతోనూ మెప్పిస్తోంది. సౌత్​తో పాటు నార్త్​లోనూ అవకాశాలను అందుకుంటోంది. అయితే ఇప్పుడామె 'ఛావా అనే హిస్టారికల్​ సినిమాలో నటిస్తోంది. విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ తనయుడు శంభాజీ మహరాజ్‌ జీవిత కథతో రానున్న సినిమాలో మహారాణిగా కనిపించనుంది. శంభాజీ పట్టమనిషిగా మహారాణి ఏసుబాయి పాత్రలో సందడి చేయనుంది. ఈ ఏడాది డిసెంబరు 6న సినిమా విడుదల కానుంది.

భీమ్లా నాయక్‌, సార్‌, విరూపాక్ష సినిమాలతో ఆకట్టుకున్న సంయుక్తా మేనన్‌, 'ఇస్మార్ట్‌ శంకర్‌', 'మాస్ట్రో' చిత్రాలతో మెప్పించిన నభా నటేష్‌ కలిసి చారిత్రక నేపథ్యమున్న స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. నిఖిల్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లు ఇద్దరు యువ రాణుల పాత్రల్లో కనిపించనున్నారు.

Ritu Varma Swag Movie : తరతరాలుగా సాగుతున్న ఆడ, మగ ఆధిపత్య పోరును ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం శ్వాగ్​. శ్రీవిష్ణు హీరోగా వినోదాత్మక చిత్రంగా రానున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, మగ వారిపై పగతో రగిలిపోయే వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి పాత్రలో కనిపించనుంది. మగ వాడంటేనే పగ వాడు, వాడి ఉనికిని ఉండనిస్తామా అంటూ కత్తి పట్టింది. అక్టోబరు 4న ఈ చిత్రం రానుంది.

Nidhi Agarwal Hari Hara Veera Mallu : ఇస్మార్ట్‌ శంకర్‌, హీరో చిత్రాలతో ఆకట్టుకున్న నటి నిధి అగర్వాల్‌ పవన్ కల్యాణ్​ హరి హర వీరమల్లులో రాణిగా అలరించనుంది. 17వ శతాబ్దం నాటి మొఘలు సామ్రాజ్య నేపథ్యంలో సినిమా సాగనుంది. ఇందులో నిధి పంచమి అనే యువరాణిగా కనిపించనుంది.

'ప్లీజ్​ అలా అనొద్దు, అలాంటి పదాలు వాడొద్దు' : సంగీత దర్శకుడు తమన్‌ - Thaman GameChanger Movie

'ది గోట్' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ అఫీషియల్ డీటెయిల్స్​ - ఏకంగా ఎంత వసూలు చేసిందంటే? - The GOAT First Day Collections

Last Updated : Sep 7, 2024, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details