Rana New Movie :'రానా నాయుడు' సీక్వెల్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో రానా తన అప్‌కమింగ్ మూవీస్ గురించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం అభిమానుల్లో కాస్త నిరాశ కలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ 'వేట్టయాన్'లో కీ రీల్ చేస్తున్నప్పటికీ, తాజాగా ఆయన హీరోగా ఒక్క సినిమా కూడా పట్టాలెక్కలేదు. గతంలో తేజా, రానా కాంబినేషన్లో 'రాక్షస రాజా' అనే మూవీ అనౌన్స్ చేసినప్పటికీ, ఆ సినిమా టైటిల్ తప్ప మిగతా ఏ అప్డేట్స్ కూడా ఇప్పటివరకూ రాలేదు.
రానా కొత్త మూవీ - ఎప్పుడూ టచ్ చేయని జానర్లో! - RANA NEW MOVIE
Rana New Movie : టాలీవుడ్ స్టార్ హీరో రానా త్వరలో ఓ భారీ ప్రాజెక్టులో భాగం కానున్నారట. అయితే ఆయన ఇప్పటి వరకూ టచ్ చేయని ఓ జానర్లో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా
Rana New Movie (ETV Bharat)
Published : Aug 15, 2024, 5:04 PM IST
అయితే ఎట్టకేలకు రానా ఓ కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డెబ్యూ డైరెక్టర్ కిషోర్‌తో కలిసి ఆయన ఓ హారర్ టచ్ ఉన్న చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. 'బాహుబలి' ప్రొడ్యూసర్స్ తమ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.