తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రిలీజ్​కు ముందే 'గేమ్ ఛేంజర్' దూకుడు - బాలయ్య సినిమాను వెనక్కినెట్టి! - RAMCHARAN GAMECHANGER

రామ్​చరణ్ 'గేమ్ ఛేంజర్'పై ఎక్కువ ఆసక్తి చూపిస్తోన్న ఆడియెన్స్​ - బాలయ్య సినిమా కన్నా ఎక్కువగా!

Ramcharan Balakrishna
Ramcharan Balakrishna (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2024, 7:42 PM IST

Ramcharan GameChanger : దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్​లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్​గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్​చరణ్​, ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ అందరూ తెగ వెయిటింగ్ చేస్తున్నారు.

అయితే వాస్తవానికి 'ఆర్ఆర్ఆర్' తర్వాత చిరంజీవితో కలిసి ఆచార్య అనే సినిమా చేశారు రామ్ చరణ్. కానీ ఇది బాక్సాఫీస్ ముందు నిరాశ పరిచింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ గేమ్ ఛేంజర్​ పైనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడీ 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి రిలీజ్ కానున్న సినిమాల​ విషయంలో దూకుడు చూపిస్తోంది.

బుక్​ మై షోలో టాప్​

బుక్ మై షోలో సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది. 2025 సంక్రాంతికి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్​'తో పాటు వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం', బాలకృష్ణ 'డాకు మహారాజ్', అజిత్ 'విడా ముయర్చి' సినిమాలు కూడా ఉన్నాయి. అయితే బుక్​ మై షోలో గేమ్ ఛేంజర్ సినిమాకే ఎక్కువ ఇంట్రెస్ట్స్ (ఇప్పటివరకు) రావడం విశేషం. దీంతో రామ్ చరణ్‌ పాపులారిటీ బాగా పెరిగిపోయింది అనడానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు ఫ్యాన్స్​. టాలీవుడ్ సీనియర్ హీరోలను మించి చరణ్ క్రేజ్ ఉందని మరోసారి నిరూపితమైందని చెబుతున్నారు.

బుక్ మై షోలో గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటికే 281.3కే ఇంట్రెస్ట్స్ ను దక్కించుకుంది. గేమ్ ఛేంజర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం 146.9కేతో ఉంది. బాలకృష్ణ హీరోగా వస్తోన్న డాకు మహారాజ్​ 128కేతో నిలిచింది. ఇక తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల అవుతుందని ఊహిస్తున్న 'విడా ముయర్చి' సినిమాను చూడడానికి 45 వేల మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే రిలీజ్​ లోపల ఈ సినిమాల ఇంట్రెస్ట్​ సంఖ్య మారుతుంది. మొత్తంగా ఈ సినిమాలన్నింటిలో గేమ్​ ఛేంజర్ రికార్డులను బ్రేక్ చేస్తుందని అంతా ఆశిస్తున్నారు.

ఇకపోతే తాజాగా గేమ్‌ ఛేంజర్‌ నుంచి, నిర్మాత దిల్‌ రాజు పుట్టినరోజు సందర్భంగా 'హ్యాపీ లైఫ్‌కు మైక్రో మంత్ర' పాట ప్రోమో (Dhop Song Promo)ను టీమ్‌ విడుదల చేసింది. ఫుల్‌ సాంగ్‌ (లిరికల్‌ వీడియో) ఈ నెల 22న రిలీజ్‌ చేయనుంది. 2025 జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నార్త్ ఇండియాలో 'పుష్ప 2' విధ్వంసం - ఏకంగా ఎన్ని కోట్లంటే?

ప్రెగ్నెన్సీ అని తెలిసి చాలా కంగారు పడ్డా - సరిగ్గా నిద్ర కూడా లేదు : రాధికా ఆప్టే

ABOUT THE AUTHOR

...view details