Game Changer Teaser :గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ లీడ్ రోల్లో దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సినిమా 'గేమ్ ఛేంజర్'. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లోనే టీజర్ రిలీజ్ చేశారు.
1.30 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. హీరో రామ్‌చరణ్ లుక్స్, డైలాగ్స్, హెవీ బీజీఎమ్ ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో మిలియన్లకొద్దీ వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి గేమ్‌ఛేంజర్ 55 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సినిమాలో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్లో కనిపించనున్నారు. కాలేజీ స్టూడెంట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా మారిన రామ్ చరణ్, ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథగా చూపించనున్నట్లు అర్థమవుతోంది. కాలేజీ లైఫ్‌లోనే లవ్ ట్రాక్, ఫ్రెండ్స్ గ్యాంగ్, కామెడీ సీన్స్ లాంటి అంశాలను కూడా చూపించనున్నారు. ఇక మొదటగా హెవీ క్రౌడ్, స్లో బీజీఎమ్‌తో టీజర్ మొదలైంది.