Ramayana Movie Yash :బీటౌన్‌లో తెరకెక్కుతున్న 'రామయణ' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే గతంలో రణ్‌బీర్, సాయి పల్లవికి సంబంధించిన షూటింగ్ స్టిల్స్ బయటకి రావడం వల్ల మేకర్స్ కూడా చాలా జాగ్రత్తపతుడున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు అన్నీ సీక్రెట్‌గా ఉండాలని భావిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాలో యశ్ పాత్ర గురించి ఓ రూమర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంట్లో రావణుడి పాత్రలో కనిపించనున్న యశ్ కోసం మేకర్స్ భారీ సన్నాహాలే చేస్తున్నారట. తన పాత్రకు సంబంధించిన చిన్న డీటైలింగ్ కూడా గ్రాండ్‌గా ఉండాలనుకుంటున్నారట. ఇందులో భాగంగానే తాను ధరించనున్న దుస్తులు, ఆభరణాలు, వాడే వస్తువులు అన్నీంటినీ నిజమైన బంగారంతో తయారు చేసినవే వినియోగించనున్నట్లు సమాచారం.
రావణుడు స్వర్ణ నగరమైన లంకాపురికి రాజు. అప్పట్లో ఆయన ధరించిన వస్త్రాలు కూడా బంగారుతో తయారుచేసినవని ఇతిహాసాల్లోనూ పేర్కొంది. అందుకే ఈ సినిమాలోనూ రావణుడి పాత్రను అలాగే చూపించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇది విన్న ఫ్యాన్స్ ఓకింత షాకైనప్పటికీ, మేకర్స్ ఆలోచన విధానానికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. పలువురు యశ్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు.