Ram Charan Upasana Cute Video :గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జోడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో మోస్ట్ క్యూట్ అండ్ ఇన్స్పిరేషనల్ కపుల్స్‌లో ఒకరు. ఈ ఇద్దరూ తమ వర్క్ లైఫ్‌లో బిజీగా ఉంటూనే తమ ఫ్యామిలీతోనూ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ముఖ్యమైన ఈవెంట్స్‌లో ఒకరికొకరు తోడు ఉంటూ ఎంకరేజ్ చేస్తుంటారు. ఇటీవలే రామ్ చరణ్ చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీలో చెర్రీ డాక్టరేట్ పట్టా తీసుకున్నాడు. ఇక అక్కడికి ఉపాసక కూడా వెళ్లారు. ఇక వాళ్లు యూనివర్సిటీలో ఉన్నప్పటి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అందులోని ఓ క్యూట్ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
అందులో రామ్‌చరణ్ స్టేజీ మీద కూర్చుని ఉండగా, ఉపాసన ఆడియన్స్ రో లో ఉన్నారు. ఇక స్టేజీ పై నుంచి చెర్రీ ఉపాసనకు సైగలు చేస్తూ ఏదో చెప్పారు. దానికి ఉప్సీ కూడా సైగల్లోనే రిప్లై ఇచ్చారు. ఇలా ఈ జంట కాసేపు అలానే మాట్లాడుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. క్యూట్ వీడియో, కపుల్ గోల్స్ అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. పొలిటికల్ యాక్షన్ థీమ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇందులో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా, ఈ సినిమాలో నటి అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు.