Ram Charan Family Trip :గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన కుటుంబంతో పాటు పలువురు ఫ్రెండ్స్‌తో కలిసి థాయ్‌లాండ్ వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ సరదగా గడిపి ఇప్పుడు హైదరబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియా వేదికగా తాము వెకేషన్లో స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను షేర్ చేశారు. అందులో చెర్రీ, ఉపాసన తమ గారాల పట్టి క్లీన్కారాతో కలిసి ఓ గున్న ఏనుగుకు స్నానం చేయిస్తూ కనిపించారు. ఇంక మరో ఫొటోలో కుక్క పిల్ల రైమ్ కూడా సముద్రంలో స్విమ్ చేస్తూ సందడి చేసింది.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. పొలిటికల్ యాక్షన్ థీమ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇందులో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా, ఈ సినిమాలో నటి అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఇటీవలే చెర్రీ బర్త్‌డే స్పెషల్‌గా ఈ చిత్రం నుంచి జరగండి అనే సాంగ్‌ను విడుదల చేేేశారు.
ఇక డైరెక్టర్ శంకర్ ఈ పాటను చాలా గ్రాండ్‌గా డిజైన్ చేశారు. నేచురల్ లుక్ కోసం ప్రత్యేకంగా ఈ సెట్ వేశారు. దీనికి కోసం మేకర్స్ భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బ్యాక్‌గ్రౌండ్ సెట్స్, విజువల్ వర్క్స్ అదిరిపోయాయి. రియల్ లొకేషన్లోనే సాంగ్ షూట్ చేసినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా రామ్‌చరణ్- కియారా లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ సాంగ్‌కు హైలైట్‌గా నిలిచాయి. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ, స్టిల్స్, కాస్ట్యూమ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.