Vettaiyan Day 1 Colletion :సూపర్‌స్టార్ రజనీకాంత్- టిజే జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'వేట్టయాన్'. ఈ మూవీ పాన్ఇండియా లెవెల్లో వరల్డ్‌వైడ్ అక్టోబర్ 10న గ్రాండ్‌గా రిలీజైంది. ప్రీమియర్ షో నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. తొలి రోజు థియేటర్ ఆక్యుపెన్సీ డీసెంట్‌గా నమోదైంది. అయితే ఈ మూవీ ఓపెనింగ్ కలెక్షన్లు ఎంతంటే?
రజనీ వేట్టయాన్ తొలిరోజు భారీ స్థాయిలోనే వసూళ్లు సాధించింది. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ. 65 కోట్ల కలెక్షన్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో భారత్‌లోనే రూ.30 కోట్ల వసూళ్లు ఉన్నాయట. అత్యధికంగా తమిళ్లో రూ.26 కోట్లు వసూల్ చేయగా, తెలుగులో రూ. 3.2 కోట్లు, హిందీలో రూ.60 లక్షల దాకా కలెక్షన్ చేసిందని అంచనా.
తమిళ్లో సెకండ్ బిగ్గెస్ట్!
2024 కోలీవుడ్ ఇండస్ట్రీలో వేట్టయాన్ ఓపెనింగ్ వసూళ్లలో రెండో స్థానం దక్కించుకుందని తెలుస్తోంది. ఈ ఏడాది తమిళ్ బాక్సాఫీస్ వద్ద విజయ్ తలపతి 'గోట్' (GOAT) అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా తొలిరోజు తమిళ్ వెర్షన్ రూ.38 కోట్ల దాకా వసూల్ చేసింది. కాగా, తాజాగా రజనీ వేట్టయాన్ తమిళ్ వెర్షన్లో రూ.26 కోట్లు కలెక్షన్ సాధించినట్లు అంచనా వేస్తున్నాయి.
జైలర్ కన్నా తక్కువే!
గతేడాది రిలీజైన రజనీ సూపర్ హిట్ ఫిల్మ్ 'జైలర్' కన్నా 'వేట్టయాన్' ఇండియా ఓపెనింగ్ కలెక్షన్లు తక్కువగానే నమోదు అయ్యాయి. 'జైలర్' డే 1 భారత్‌లో రూ. 48.35 వసూల్ చేసింది.