తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నిమిషానికి కోటిన్నర - 'లాల్​ సలామ్'​ రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? - లాల్ సలామ్ రజనీకాంత్​

Rajinikanth Remuneration : 'లాల్​ సలామ్'​ కోసం సూపర్ స్టార్​ రజనీకాంత్ తీసుకున్న రెమ్యునరేషన్​ ప్రస్తుతం హాట్ టాపిక్​గా మారింది. ఆ వివరాలు.

నిమిషానికి కోటిన్నర - 'లాల్​ సలామ్'​ రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
నిమిషానికి కోటిన్నర - 'లాల్​ సలామ్'​ రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 10:44 AM IST

Rajinikanth Remuneration : సూపర్ స్టార్ రజనీకాంత్ కీ రోల్​ పోషించిన లేటెస్ట్ మూవీ 'లాల్ సలాం' మరో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా కోసం సూపర్ స్టార్​ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు? చిత్రంలో ఆయన ఎంత పాత్ర నిడివి ఎంత సేపు? వంటి వివరాలు తెలిశాయి.

వివరాళ్లోకి వెళితే. ఈ చిత్రానికి రజినీకాంత్​ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ ఆమె మెగాఫోన్ పట్టారు. క్రికెట్ అండ్​ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించగా - మోయిద్దీన్ భాయ్ అనే కీలక పాత్రలో రజనీ కనిపించారు.

అయితే ప్రస్తుతం రజనీ కాంత్ క్రేజ్ ఏ రేంజ్​లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. రీసెంట్​గా 'జైలర్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్​లో భారీ బ్లాక్ బాస్టర్​ను ఖాతాలో వేసుకున్న ఆయన ఆ చిత్రానికిగానూ ఏకంగా రూ.200 కోట్ల వరకు అందుకున్నారని తెలిసింది.

అయితే ఇప్పుడు 'లాల్​ సలామ్'​ సినిమాకు గానూ రజనీకాంత్ ఎంత రెమ్యునరేషన్​ తీసుకున్నారో తాజాగా వార్తలు బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో ఆయన పోషించిన కీలక పాత్ర కేవలం అరగంట మాత్రమే ఉంటుందట. కానీ దీని కోసం పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్​ను వసూలు చేశారని తెలిసింది. దాదాపు రూ.40 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం అందింది. అంటే ఈ లెక్కన రజనీ నిమిషానికి రూ. 1.33 కోట్లు తీసుకున్నారని అర్థం.

ఇకపోతే చిత్రంలో భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా గెస్ట్​ రోల్​ పోషించారు. ఇంకా ధన్యబాలకృష్ణన్, జీవిత రాజశేఖర్, విఘ్నేశ్, అనంతిక సనిల్‍కుమార్, కేఎస్ రవికుమార్ కూడా నటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

గ్రామీ విజేతలుగా శంకర్​ మహదేవన్​, జాకీర్ హుస్సేన్​

ఈ వారమే గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్​ - మొత్తం 25కుపైగా సినిమా/సిరీస్​లు రెడీ

ABOUT THE AUTHOR

...view details