Rajamouli About SSMB 29 :సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న మూవీ 'SSMB 29'. దర్శక ధీరుడు రాజమౌళి దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి రోజుకో అప్డేట్ నెట్టింట ట్రెండ్ అయ్యి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే?
'ఆర్ఆర్ఆర్' కంటే ఎక్కువ జంతువులు'
ఓ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్లో రాజమౌళి ఇటీవలే మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' కంటే ఎక్కువ జంతువులను తన తదుపరి చిత్రాల్లో చూపిస్తానని జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో 'SSMB 29'లో రాజమౌళి జంతువులతో మంచి ఫైట్స్ లేదా సీన్స్ తెరకెక్కిస్తారని మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
ఇంటర్వెల్ సీన్ అదుర్స్
'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ ఎపిసోడ్లో జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ సీన్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. వ్యాను బోనులో జంతువులను దించుతూ తారక్ ఎగిరే సీన్ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే పులులతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పోరాడిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇవి కాకుండా పులితో యంగ్ టైగర్ ఇంట్రో ఫైట్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు ఏకంగా తన తదుపరి సినిమాల్లో ఎక్కువ జంతువులను చూపిస్తానని అనడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగిపోయాయి.