Pushpa 2 USA Pre Booking: మూవీ లవర్స్‌ను ఎగ్జైట్మెంట్లో ముంచెత్తుతూ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంటున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప ది రూల్'. విడుదలకు కౌంట్‌డౌన్ మొదలవ్వడం వల్ల అభిమానుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఇప్పుడు ఎవరినోట విన్న ఎటు చూసినా పుష్ప పేరే వినిపిస్తోంది, కనిపిస్తోంది.
అయితే తాజాగా యూఎస్ ప్రీ బుకింగ్స్‌లో ఓ అరుదైన ఘనతను సాధించి ఓవర్సీస్లో పుష్ప మేనియా ఎలా ఉందో చూపించింది. ప్రస్తుతం అక్కడ ఏకంగా 1.25 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్‌ని టచ్ చేసి ఫాస్టెస్ట్ బుకింగ్స్ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. సుమారు 45 వేలకి పైగా టికెట్స్ అమ్ముడయ్యాయట. ఈ విషయాన్ని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.
ఒక్క గ్లింప్స్‌లో ఎన్నో సర్ప్రైజ్లు
గత ఆదివారం విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా ఇందులోని జాతర ఫైట్, మాస్ సీన్స్‌కు అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా కొన్ని ట్విస్ట్‌లు, మరికొన్ని కొత్త క్యారెక్టర్ల పరిచయంతో ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఈ క్రమంలో అన్ని భాషల్లోనూ మిలియన్స్‌కు పైగా వ్యూవ్స్‌తో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది ఈ ట్రైలర్.