Pushpa 2 Trailer Launch Event : "పుష్ప, ఎప్పుడూ తగ్గడు కానీ మీ ప్రేమ కోసం తగ్గుతాడు" అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన కొత్త చిత్రం పుష్ప 2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో బన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.
'తొలి సారి వచ్చా ఇక్కడికి - అలా జరిగినందుకు కారణం మీరే' : అల్లు అర్జున్ - PUSHPA 2 TRAILER LAUNCH EVENT
'పుష్ప 2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్.
Published : Nov 18, 2024, 8:06 AM IST
|Updated : Nov 18, 2024, 8:20 AM IST
"మొదటి సారి బిహార్‌కు వచ్చాను. ట్రైలర్ ఎలా ఉంది? పుష్ప, ఫ్లవరు కాదు వైల్డ్ ఫైరు. గత మూడేళ్లుగా పుష్ప 2 ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ సినిమాగా నిలిచిందంటే అందుకు కారణం మీ ప్రేమే. ప్రతి ఒక్కరికీ పుష్ప టమ్ తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ ఈవెంట్‌కు సహకరించిన బిహార్ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు. అభిమానులు మీ సమక్షంలో ట్రైలర్ రిలీజ్ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను" అని అన్నారు. అభిమానుల కోరిక మేరకు పుష్ప 2లోని హిందీ వెర్షన్ డైలాగ్‌ను చెప్పి మెప్పించారు.
ఇకపోతే ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా చీఫ్ గెస్ట్‌గా హాజరై, మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. "పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ వేడుకను బిహార్‌లో నిర్వహించడం ఆనందంగా ఉంది. బిహార్ సీఎం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు. అతిథులకు ప్రేమ పంచడంలో మేమెప్పుడూ ముందుంటాం" అని ఆయన పేర్కొన్నారు.