తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్- మాస్ లెెవెల్​లో బన్నీ ఎంట్రీ! - PUSHPA 2 TRAILER EVENT

పుష్ప ట్రైలర్ రిలీజ్ ఈవెంట్- మాస్ లెెవెల్​లో బన్నీ ఎంట్రీ!

Pushpa 2 Trailer Event
Pushpa 2 Trailer Event (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2024, 4:18 PM IST

Pushpa 2 Trailer Event: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'పుష్ప 2'. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 5న పాన్‌ ఇండియా స్థాయిలో గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే పుష్ప-2 గురించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే?

భారీ ఈవెంట్
పుష్ప 2 ట్రైలర్​ను పట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న ఐకానిక్ గాంధీ మైదాన్‌లో విడుదల చేయనున్నారు. గ్రాండ్​గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు కూడా హాజరవ్వనున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్​లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ అదిరిపోనున్నట్లు తెలుస్తోంది.

ఎంట్రీ కోసం స్పెషల్ వెహికల్!
వేదికపైకి అల్లు అర్జున్ గ్రాండ్​గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీని కోసం ఇప్పటికే మేకర్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. బన్నీ ఎంట్రీ మాస్ లెవెల్​లో ఉండేలా ఈవెంట్ నిర్వాహకులు సన్నాహాలు చేశారట. బన్నీ ఎంట్రీ కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ కథ
ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రానికి సీక్వెల్ గానే 'పుష్ప 2' రానుంది. ఓ సాధారణ కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్‌, ఎర్రచందనం సిండికేట్‌ ను శాసించే స్థాయికి ఎలా వెళ్లాడనే ఆసక్తికర అంశాలతో తొలి పార్ట్ ఆకట్టుకోగా, ఆ తర్వాత అతడికి ఎదురైన ఇబ్బందుల గురించి అలాగే వాటిని అతడు ఎదుర్కొన్న తీరు గురించి ఈ 'పుష్ప ది రూల్‌' చూడొచ్చని మేకర్స్ గతంలో వెల్లడించారు.

ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మంధన్నా, ఫహాద్ ఫాజిల్, లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా నిర్మితమైంది. డిసెంబర్‌ 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

'పుష్ప' సెట్స్ నుంచి ఫొటో లీక్- ఇంటర్నెట్​ను షేక్ చేస్తోందిగా!

పుష్ప 2కి ఒక్కరు కాదు ముగ్గురు- పెరుగుతున్న లిస్ట్​!

ABOUT THE AUTHOR

...view details